ఏడాదిలో రెండోసారి.. మరోమారు పెరిగిన ధరలు! | Hyundai to Increase Prices | Sakshi
Sakshi News home page

Hyundai: ఏడాదిలో రెండోసారి.. మరోమారు పెరిగిన ధరలు!

Apr 9 2026 9:03 PM | Updated on Apr 10 2026 9:36 AM

Hyundai to Increase Prices

ఇతర వాహన తయారీ సంస్థల మాదిరిగానే.. హ్యుందాయ్ కంపెనీ కూడా తన మొత్తం మోడల్ లైనప్‌లో ధరల అప్డేట్ ప్రకటించింది. 2026 మే 1 నుంచి కొత్త ధరలు (1 శాతం పెరుగుదలతో) అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ధృవీకరించింది.

హ్యుందాయ్ ప్రకారం.. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చుల కారణంగా ధరలను పెంచడం జరిగిందని తెలుస్తోంది. అయితే వినియోగదారులను అధిక ప్రభావం పడకుండా.. ఖర్చులలోని హెచ్చుతగ్గులను తామే భరించడానికి ప్రయత్నించినప్పటికీ, ఖర్చులు నిరంతరం పెరుగుతుండటంతో, ఆ భారాన్ని కొంతమేరకు స్వల్ప ధర పెంపు ద్వారా వినియోగదారులపై మోపవలసి వచ్చిందని కంపెనీ తెలిపింది.

ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయం కంపెనీ వెల్లడించలేదు. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. కాగా హ్యుందాయ్ కంపెనీ వాహనాల ధరలను పెంచడం 2026లో రెండవసారి. గత జనవరిలో.. తన అన్ని మోడళ్లపై 0.6 శాతం వరకు ధరలను పెంచింది. ఇటీవలే.. మార్చిలో ప్రారంభ ధర ముగిసిన తర్వాత, కంపెనీ హ్యుందాయ్ వెన్యూ ధరను రూ. 20,000 మేర సవరించింది.

Advertisement
 
Advertisement
Advertisement