WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్ | Gurugram Based Founder Fires Employee After Work From Home Request | Sakshi
Sakshi News home page

వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్

Apr 9 2026 7:39 PM | Updated on Apr 9 2026 8:14 PM

Gurugram Based Founder Fires Employee After Work From Home Request

కొన్ని కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగం నీటి మీద బుడగ మాదిరిగా అయిపోయింది. ఎప్పుడు జాబ్ పోతుందో?, ఎందుకు పోతుందో? తెలియక చాలామంది ఇప్పటికి కూడా భయం గుప్పెట్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో.. ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కోరిన ఉద్యోగిని, బాస్ రెండు నిమిషాల్లోనే తొలగించారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గురుగ్రామ్‌కు చెందిన స్టార్టప్ ఫౌండర్ నిఖిల్ రాణా.. కంపెనీ The 15లో, ఒక ఉద్యోగిని కేవలం రెండు నిమిషాలలో తొలగించేసారు. దీనికి కారణం ఆ ఉద్యోగి ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడమే అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు.

నిఖిల్ రాణా.. ఉద్యోగిని తొలగించడమే కాకుండా, ఆ విషయాన్ని లింక్డ్ఇన్‌లో షేర్ చేసారు. అంతే కాకుండా కంపెనీలో ఉద్యోగుల నుంచి తాను ఏమి కోరుకుంటున్నాడనే విషయాన్ని కూడా వెల్లడించారు. నోటిస్ పీరియడ్‌ అనేది సమయం వృధా అని కూడా పేర్కొన్నారు.

''స్వంత బాధ్యత తీసుకునే వ్యక్తులు, ఫౌండర్‌లపై ఆధారపడగలిగే వ్యక్తులు, ‘హై ఏజెన్సీ’ కలిగిన వ్యక్తులు, సరిగ్గా సమయం కోసం వేచి కూడదు, పనిని పూర్తి చేయగల వ్యక్తులు'' తనకు కావాలని నిఖిల్ రాణా చెప్పారు. నైపుణ్యాలకు ఎవరూ చిల్లిగవ్వ కూడా విలువ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇప్పుడు సాధారణమయ్యాయి అని అన్నారు.

నిఖిల్ రాణా తీరుపై చాలామంది విమర్శిస్తున్నారు. సానుభూతి లేకుండా ప్రవర్తించాడని, కేవలం ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినందుకు తక్షణమే తొలగించడం అన్యాయం అని అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఉద్యోగుల నిబద్ధతకు మరింత ఖచ్చితమైన ప్రమాణాలు ఉండాలనేది రాణా ఫీప్రాయమని కొందరు మద్దతు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement