Fortune Global 500: రిలయన్స్‌ హైజంప్‌, ర్యాంకు ఎంతంటే?

Fortune Global 500 RIL jumps 51 places to104th position details here - Sakshi

సాక్షి,ముంబై: ఫార్చ్యూన్ ప్రచురించిన 2022 గ్లోబల్-500 ర్యాంకింగ్స్‌లో బీమారంగ సంస్థ ఎల్‌ఐసీ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఐదు ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా నాలుగు ప్రైవేటు రంగానికి చెందినవి. ప్రైవేటు రంగంలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ప్రత్యేకతను చాటుకుంది. (Edible Oil: బిగ్‌ రిలీఫ్‌.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!)

వరుసగా 19వ సంవత్సరం కూడా తాజా గ్లోబల్‌ 500 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకోవడమేకాదు తన ర్యాంక్‌ను మరింత  మెరుగుపర్చుకుంది రిలయన్స్‌. ఈ జాబితాలో భారతదేశపు అత్యున్నత ర్యాంక్‌సాధించిన ప్రైవేట్ రంగ సంస్థగా  రిలయన్స్‌  నిలిచింది.  ఈ ఏడాది  51 స్థానాలు మెరుగుపడి 104వ స్థానానికి చేరుకుంది. 2021 ఏడాదిలో ఈ జాబితాలో  రిలయన్స్  ర్యాంక్‌ 155 మాత్రమే.  అయితే ఫార్చ్యూన్  గ్లోబల్ 500 లిస్ట్‌లో నిలిచిన ప్రైవేట్ రంగ కంపెనీలు టాటా మోటార్స్, టాట్ స్టీల్ ,రాజేష్ ఎక్స్‌పోర్ట్స్. 

కాగా గత ఏడాది ఐపీవోకు వచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏకైక ప్రభుత్వరంగ సంస్థ మాత్రమే కావడం విశేషం. ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లో రిలయన్స్‌ను అధిగమించి మరీ 98వ స్థానంతో అగ్రస్థానంలో నిలిచింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 142వ స్థానంలో ఉంది. ఐవోసీఎల్‌ భారతీయ కంపెనీలలో మూడో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. ఓఎన్జీసీ 190వ స్థానంతో భారతీయ కంపెనీలలో నాల్గవ స్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 236వ స్థానం, భారత్ పెట్రోలియం 295వ స్థానంలో ఉన్నాయి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో మార్చి 31, 2022 లేదా అంతకు ముందు ముగిసిన సంబంధిత ఆర్థిక సంవత్సరాల్లోని మొత్తం రాబడుల ఆధారంగా కంపెనీలకు ర్యాంక్‌లను కేటాయిస్తుంది.

(ఇదీ చదవండి:  నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top