'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ | Flipkart officially announced dates for The Big Billion Days 2025 | Sakshi
Sakshi News home page

'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

Sep 15 2025 9:24 PM | Updated on Sep 15 2025 9:26 PM

Flipkart officially announced dates for The Big Billion Days 2025

భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక అట్టహాసమైన షాపింగ్ ఫెస్టివల్ 'ది బిగ్ బిలియన్ డేస్ (TBBD) 2025' తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు సెప్టెంబర్ 22న అంటే 24 గంటల ముందే ప్రత్యేక యాక్సెస్ లభించనుంది. సెప్టెంబర్ 8న ప్రారంభమైన ‘అర్లీ బర్డ్ డీల్స్’ ఇప్పటికే బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఉత్సాహాన్ని కలిగించాయి.

ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ను భారత్‌లోని అత్యంత వేగవంతమైన డెలివరీ సేవ అయిన ‘ఫ్లిప్కార్ట్మినిట్స్కూడా భాగస్వామ్యం చేయనుంది. 19 నగరాల్లో 3,000 పిన్‌కోడ్లకు 10 నిమిషాల్లో డెలివరీ అందించనుంది. అదేవిధంగా, స్మార్ట్‌ఫోన్లు, ఏఐ ల్యాప్‌టాప్‌లు, 4కే టీవీలు, ​​కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వంటి ప్రీమియం ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరలకు లభించనున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ ఈ ఫెస్టివ్ సీజన్‌లో అభివృద్ధి చెందుతున్న నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. షాప్సీ ద్వారా రూ.29/- నుండి ప్రారంభమయ్యే డీల్స్, 100% సూపర్‌ కాయిన్ల రివార్డ్స్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. సప్లై చైన్ విభాగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, 400 కొత్త మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వేగవంతమైన డెలివరీకి మార్గం వేసింది.

ఇతర బ్యాంకింగ్ భాగస్వామ్యాలు, క్యాష్బ్యాక్‌, నో కాస్ట్ఈఎంఐ, యూపీఐ డిస్కౌంట్లు మొదలైన వాటితో ఫ్లిప్‌కార్ట్ ఈ బిగ్ బిలియన్ డేషస్ను ఇండియా డిజిటల్ ఫ్యూచర్‌కి దారితీసే వేడుకగా మార్చేందుకు సిద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement