breaking news
The Big billion Days
-
'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక అట్టహాసమైన షాపింగ్ ఫెస్టివల్ 'ది బిగ్ బిలియన్ డేస్ (TBBD) 2025' తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు సెప్టెంబర్ 22న అంటే 24 గంటల ముందే ప్రత్యేక యాక్సెస్ లభించనుంది. సెప్టెంబర్ 8న ప్రారంభమైన ‘అర్లీ బర్డ్ డీల్స్’ ఇప్పటికే బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఉత్సాహాన్ని కలిగించాయి.ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్‌ను భారత్‌లోని అత్యంత వేగవంతమైన డెలివరీ సేవ అయిన ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ కూడా భాగస్వామ్యం చేయనుంది. 19 నగరాల్లో 3,000 పిన్కోడ్లకు 10 నిమిషాల్లో డెలివరీ అందించనుంది. అదేవిధంగా, స్మార్ట్ఫోన్లు, ఏఐ ల్యాప్‌టాప్‌లు, 4కే టీవీలు, కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వంటి ప్రీమియం ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరలకు లభించనున్నాయి.ఫ్లిప్‌కార్ట్ ఈ ఫెస్టివ్ సీజన్లో అభివృద్ధి చెందుతున్న నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. షాప్సీ ద్వారా రూ.29/- నుండి ప్రారంభమయ్యే డీల్స్, 100% సూపర్ కాయిన్ల రివార్డ్స్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. సప్లై చైన్ విభాగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, 400 కొత్త మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వేగవంతమైన డెలివరీకి మార్గం వేసింది.ఇతర బ్యాంకింగ్ భాగస్వామ్యాలు, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, యూపీఐ డిస్కౌంట్లు మొదలైన వాటితో ఫ్లిప్‌కార్ట్ ఈ బిగ్ బిలియన్ డేషస్ను ఇండియా డిజిటల్ ఫ్యూచర్‌కి దారితీసే వేడుకగా మార్చేందుకు సిద్ధమైంది. -
ఈ–కామర్స్ పండుగ సేల్ 26 నుంచి షురూ..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా సెప్టెంబర్ 26 నుంచి వార్షిక పండుగ సేల్ ప్రారంభించనున్నాయి. 27 నుంచి అందరికీ సేల్ అందుబాటులోకి వస్తుందని, అంతకన్నా 24 గంటల ముందు తమ పెయిడ్ సబ్స్క్రయిబర్స్కు యాక్సెస్ లభిస్తుందని ఇరు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ది బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 పేరిట ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) పేరుతో అమెజాన్ ఇండియా వీటిని నిర్వహించనున్నాయి. 20 నగరాలవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ప్రోడక్టు కేటగిరీల్లో ఉత్పత్తులను అదే రోజున అందించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈసారి విక్రేతలకు 20 శాతం అధికంగా రివార్డులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు, ఏజీఐఎఫ్లో భాగంగా 14 లక్షల మంది పైగా విక్రేతలు, ప్రోడక్టులను విక్రయించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
వచ్చే నెల్లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్‌లో ’ది బిగ్ బిలియన్ డేస్’ (టీబీబీడీ) సేల్ ప్రారంభించనుంది. టీబీబీడీ అయిదో ఎడిషన్ అక్టోబర్ 10 నుంచి 14 దాకా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, ఫర్నిచర్ మొదలైన వాటన్నింటిపై భారీ ఆఫర్లు ఉంటాయని సంస్థ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. వచ్చే నెల పండుగ సీజన్లో వివిధ ఈ–కామర్స్ సైట్లలో దాదాపు 2 కోట్ల మంది షాపింగ్ చేస్తారని అంచనాలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ చేతికి ఇజ్రాయెల్ కంపెనీ.. ఇజ్రాయెల్‌కి చెందిన అప్‌స్ట్రీమ్ కామర్స్ సంస్థను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడించలేదు. ఉత్పత్తులు.. వాటి ధరల విశ్లేషణ తదితర అంశాలకు సంబంధించి అప్‌స్ట్రీమ్ కామర్స్ క్లౌడ్ ఆధారిత సర్వీసులు అందిస్తోంది. తమ ప్లాట్‌ఫాంపై విక్రయించేవారికి మార్కెట్‌పై మరింత అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ కొనుగోలు తోడ్పడుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. -
10 గంటల్లో 5 లక్షల మొబైల్స్ సేల్
మెట్రో నగరాల నుంచి భారీగా ఆర్డర్లు: ఫ్లిప్‌కార్ట్ న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పది గంటల్లో 5 లక్షల మొబైళ్లను విక్రయించింది. ద బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ స్థాయి అమ్మకాలు సాధించామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్నేసి ఫోన్లు విక్రయించడం రికార్డ్ అని ఫ్లిప్‌కార్ట్ హెడ్(కామర్స్ ప్లాట్‌ఫారమ్) ముకేశ్ బన్సాల్ పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల 17(శనివారం)న ముగుస్తుంది. బుధవారం అర్థరాత్రి నుంచి అమ్మకాలు మొదలు పెట్టామని, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుంచి భారీ సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని బన్సాల్ వివరించారు. విశాఖపట్టణం, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూర్ వంటి టైర్ టూ నగరాల నుంచి కూడా డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొన్నారు. అమ్ముడైన ఈ 5 లక్షల మొబైల్ ఫోన్లలో మూడో వంతు వాటా 4జీ మొబైల్ ఫోన్లదేనని తెలిపారు. పది గంటల్లో ఐదు లక్షల మొబైల్ ఫోన్లు అమ్ముడవడం,. భారత్‌లో స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచి స్తోందని చెప్పారు. కాగా ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం రోజున 10 గంటల్లో 10 లక్షల వస్తువులను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. 70 కేటగిరీల్లో 3 కోట్ల వస్తువులను ఆఫర్ చేస్తున్నామని, 5 కోట్ల మంది నమోదిత వినియోగదారులున్నారని, రోజుకు కోటికి పైగా విజిట్స్ వస్తున్నాయని కంపెనీ అంటోంది.


