
ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ తన ప్రముఖ ఉత్సవ సేల్ “ది బిగ్ బిలియన్ డేస్” (TBBD) 2025ను భారతదేశంలోనే వేగవంతమైన షాపింగ్ ఫెస్టివల్‌గా మార్చుతోంది. దీని ముఖ్య ఆకర్షణగా “ఫ్లిప్‌కార్ట్ మినిట్స్” పరిచయం అవుతోంది. కేవలం 10 నిమిషాల్లో డోర్‌డెలివరీ అందించనుంది.
దేశవ్యాప్తంగా 19 నగరాలు, 3,000 పిన్‌కోడ్ల పరిధిలో ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. మొబైళ్లు, ఎలక్ట్రానిక్స్, కిరాణా, పండ్లు, కూరగాయలు, బ్యూటీ, పర్సనల్ కేర్ వంటి విభాగాల్లో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్, ప్రత్యేక రివార్డులు లభిస్తాయి. తాజా కాయగూరలు రూ.9 నుంచి ప్రారంభమవుతాయి. దేశీ బ్రాండ్లతో పాటు అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
స్వీట్స్, హాంపర్స్, లిప్‌స్టిక్స్ రూ.49 నుంచి, డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లపై 80% వరకు తగ్గింపులు ఉండబోతున్నాయి. గౌర్మెట్ బ్రాండ్లపై 50% వరకు డిస్కౌంట్లు లభిస్తాయి.
"ఈ సంవత్సరం మేము వేగం, విలువ, విశ్వసనీయతతో బిగ్ బిలియన్ డేస్ను మరింత వినూత్నంగా మార్చుతున్నాం. మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాల్లోనూ వినియోగదారులకు వేగంగా సేవలు అందించడమే మా లక్ష్యం” అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రీ అన్నారు.