ఫ్లిప్​కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు

Flipkart Big Saving Days Sale To Start From July 25 - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరో సేల్ ను ముందుకు తీసుకొచ్చింది. ఈ సేల్ జూలై 25 నుంచి జూలై 29 వరకు నడుస్తుంది. ఈ సేల్ లో కొన్ని టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యుల కొరకు ఈ సేల్ 1 రోజు ముందుగా ప్రారంభం అవుతుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ అనేది అమెజాన్ ప్రైమ్ కు ఫ్లిప్ కార్ట్ కు సమానం. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కావడానికి కేవలం ఒక వారం మాత్రమే ఉంది. ఈ సేల్ లో ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

ప్రస్తుతం రూ.23,999 ధర గల పోకో ఎక్స్3 ప్లస్ సేల్ సమయంలో రూ.17,249 (ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ తో సహా) లభ్యం అవుతుంది. పోకో ఎక్స్3 ప్లస్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ ప్లేతో వస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రియర్ క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ప్రస్తుతం రూ.23,999 ధరకు లభిస్తున్న షియోమీకి చెందిన ఎంఐ 11 లైట్ రూ.20,499 (బ్యాంక్ ఆఫర్ తో సహా) లభ్యం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. దీంతో పాటు శామ్ సంగ్, ఒప్పో, వివో, ఆపిల్ బ్రాండ్స్ కి చెందిన మొబైల్స్ పై కూడా భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు ఫ్లిప్​కార్ట్ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top