మొదలైన ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్.. మొబైల్స్ పై భారీ ఆఫర్లు

Flipkart Big Saving Days Sale 2021: Know About Best Offers On Top Smart Phones - Sakshi

న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సందర్బంగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(జనవరి 20) నుంచి జనవరి 24 వరకు కొనసాగనుంది. వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన ఐదు రోజుల సేల్ లో ప్రముఖ మొబైల్ ఫోన్లు, టీవీలు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ పై మంచి ఆఫర్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ ప్రస్తుతం లైవ్ లో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు నిన్నటి నుంచే అందుబాటులో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులు 10 శాతం(కార్డుపై రూ.1,500 వరకు) తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్ లో మొబైల్ పై తీసుకొచ్చిన కొన్ని ఉత్తమమైన ఆఫర్స్ మీకోసం అందిస్తున్నాం.(చదవండి: వాట్సాప్‌కు కేంద్రం గట్టి హెచ్చరిక)

ఆపిల్ ఐఫోన్ 11: 
ఆపిల్ ఐఫోన్ 11 64జీబీ వేరియంట్ ఈ వారం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.48,999(అసలు రూ.54,900)కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,500 వరకు డిస్కౌంట్ లభించనుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ:
ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్ ఈ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.31,999(అసలు రూ.39,900)కి లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులకు రూ.3,000 డిస్కౌంట్ కూడా లభించనుంది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయినప్పటి నుంచి ఇదే అతి తక్కువ ధర. అలాగే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,500 వరకు డిస్కౌంట్ లభించనుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్:  
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్ మళ్లీ రూ.44,999(ఎంఆర్‌పి రూ.83,000)కి లభిస్తుంది. గెలాక్సీ ఎస్ 20 ప్లస్ ఇప్పటికీ ఈ ధర వద్ద మంచి ఎంపికగా కనిపిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గెలాక్సీ ఎస్ 20 ప్లస్ పై కూడా రూ.16,500 వరకు డిస్కౌంట్ లభించనుంది.

పోకో ఎక్స్ 3:
గత ఫ్లిప్‌కార్ట్ సేల్ లో పోకో ఎక్స్ 3ను కొనలేకపోయినట్లయితే ఈ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో మరోసారి రూ.14,999 (ఎంఆర్‌పి రూ.19,999)కు కొనుగోలు చేయవచ్చు. పోకో ఎక్స్ 3 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్ ఉంది. దీనిలో 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మీకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా లభిస్తాయి.

మోటో జీ 5జీ:
మోటో జీ 5జీ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.18,999(ఎంఆర్‌పి రూ.24,999)కే లభిస్తుంది. మోటో జీ 5జీ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనిలో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇది 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 20వాట్  ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 

ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్: 
ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ఈ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.39,990(ఎంఆర్‌పి రూ.55,000)కి లభిస్తుంది. ఒకవేళ మీరు డ్యూయల్ స్క్రీన్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top