తొలగించిన కంపెనీ.. మళ్లీ పిలిచింది: చివరికి అవమానమే! | Fired Employee Asked to Train Replacements | Sakshi
Sakshi News home page

తొలగించిన కంపెనీ.. మళ్లీ పిలిచింది: చివరికి అవమానమే!

Apr 11 2026 5:13 PM | Updated on Apr 11 2026 5:14 PM

Fired Employee Asked to Train Replacements

ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీల తీరు చాలా మారిపోయింది. సంస్థలు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో ఘటన తెరమీదకు వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఒక మహిళ తన ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

రెడ్దిట్ పోస్టు ప్రకారం.. గత సంవత్సరం ఒక కంపెనీలో పనిచేస్తూ ఆమె పనిని ఎంతో నిబద్ధతతో, 100 శాతం కృషితో నిర్వహించారు. అయినప్పటికీ, తనకు మొదటి నుంచే అక్కడ ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. కొత్తగా చేరిన ఉద్యోగులను టీమ్‌లో అధికారికంగా పరిచయం చేసే విధానం ఉన్నప్పటికీ, తనను మాత్రం ఎప్పుడూ సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇది చిన్న విషయంగా అనిపించినప్పటికీ.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కలిగించిందని పేర్కొన్నారు.

ఇతర ఉద్యోగులను సమావేశాలకు పిలిచినప్పుడు, తనను మాత్రం తరచూ పక్కన పెట్టేవారు. కొంతమంది సహచరులు కూడా “మీరు మీటింగ్‌లో ఎందుకు లేరు?” అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆమెకు అసౌకర్యంగా మాత్రమే కాకుండా.. అవమానకరంగా అనిపించాయని అన్నారు.

కొంతకాలం తర్వాత.. కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించింది. సంస్థ నిర్ణయాన్ని ప్రశాంతంగా స్వీకరించింది. కానీ తర్వాత.. అదే పని కోసం ఇద్దరిని కొత్తగా నియమించుకున్నారని తెలుసుకున్నప్పుడు ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అంతే కాకుండా.. కొన్ని నెలల తర్వాత అదే కంపెనీ తనను మళ్లీ సంప్రదించి, తాత్కాలికంగా తిరిగి రావాలని కోరింది. కొత్తగా చేరిన ఉద్యోగులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఉద్యోగ జీవితంలో గ్యాప్ రాకుండా ఉండాలని భావించి, ఆమె తిరిగి ఆ ఆఫర్‌ను అంగీకరించారు.

ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే.. ''నా తర్వాత నియమితులైన వారికి నేను సహాయం చేస్తున్నాను, వారే నాకు రోజువారీ పనులు అప్పగిస్తూ ఏమి చేయాలో చెబుతున్నారు''.

ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆమె తనకు తాను నిలబడాల్సిందని, కంపెనీ వద్ద తిరిగి చేరినప్పుడు కఠినమైన షరతులు పెట్టాల్సిందని సూచించారు. కొందరు కన్సల్టింగ్ ఫీజులు తీసుకోవాలని కూడా అభిప్రాయపడ్డారు. మరికొందరు.. తన స్వభావం కారణంగా తాను మృదువుగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement