
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు తాజా పెట్టుబడుల క్రమం ఎంతో అవసరమని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అన్నారు. కనుక తాజా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాలని కోరారు. చాలా కాలంగా ప్రైవేటు మూలధన వ్యయాలు నీరసంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా పిలుపునివ్వడం గమనార్హం. పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కంపెనీలు బలమైన బ్యాలన్స్ షీట్లతో మెరుగైన స్థితిలో ఉన్నట్టు చెప్పారు. ఇందుకు ఆర్థిక శాఖ మద్దతు కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం తన వంతుగా మూలధన వ్యయాలు పెంచడాన్ని, విధానపరమైన సంస్కరణలను గుర్తు చేశారు. నాబ్‌ఫిడ్ వార్షిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. పెట్టుబడులతో కంపెనీలు, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతాయని, విశ్వాసం తిరిగి నెలకొంటుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అనిశి్చతుల్లోనూ చెక్కుచెదరకుండా ఉన్నట్టు చెప్పారు. జూన్ క్వార్టర్‌లో ఐదు త్రైమాసికాల గరిష్ట స్థాయిలో జీడీపీ వృద్ధి 7.8 శాతం నమోదు కావడాన్ని ప్రస్తావించారు.
ఇదీ చదవండి: ‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’