ఉన్నపళంగా 200ల మందికి ఉద్వాసన!

Edutech Unicorn Vedantu Lay off 200 Employees - Sakshi

గతేడాది యూనికా‍ర్న్‌ హోదాను దక్కించుకున్న ఎడ్యుటెక్‌ కంపెనీ వేదాంతూ ఉద్యోగులకు ఝలక్‌ ఇచ్చింది. ఉన్న పళంగా రెండు వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇందులో 120 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా మరో 80 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఉన్నారు. తమ సంస్థ వృద్ధి ప్రణాళికలకు తగ్గట్టుగానే ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టినట్టు వేదాంతూ ప్రకటించింది.

పులకిత్‌ జైన్‌, వంశీకృష్ణ, ఆనంద్‌ ప్రకాశ్‌లు ముగ్గురు కలిసి 2011 ఎడ్యుటెక్‌ స్టార్టప్‌గా వేదాంతూను ప్రారంభించారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఈ రౌండ్‌ ఫండ్‌ రైజింగ్‌లో భారీ పెట్టుబడులు సాధించి యూనికార్న హోదాను దక్కించుకుంది. అయితే ఆ కంపెనీ నిర్దేశించుకున్న ప్రణాళికా ప్రకారం వృద్ధి లేకపోవడం మరోవైపు భవిష్యత్తు అవసరాల తగ్గట్టుగా ప్లాన్స్‌ చేంజ్‌ చేయాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

వేదాంతులో దేశవ్యాప్తంగా 6000ల మంది ఉద్యోగులు పని చేస్తుండగా ఇందులో 3.5 శాతం ఉద్యోగులు తాజాగా ఉపాధి కోల్పోయారు. ఇందుకు ముందు మరో యానికార్న్‌ ఎడ్యుటెక్‌ కంపెనీ అన్‌అకాడమీ సైతం 600ల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది.

చదవండి: బ్రాండ్‌ ఇమేజ్‌కి డ్యామేజ్‌ అయితే కష్టం.. భవీశ్‌కి ఎన్ని తిప్పలో..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top