
మీకు కొటక్ మహీంద్రా బ్యాంక్ గురించి తెలుసే ఉంటుంది. అయితే మీరెప్పుడైనా కొటక్ మహీంద్రా బ్యాంక్ పేరులో ‘మహీంద్రా’ అనే పేరు ఎందుకు ఉందోనని అనుకున్నారా? ఆనంద్ మహీంద్రా వాళ్ల ఇంటి పేరు మీదగా కొటక్ మహీంద్రా బ్యాంక్‌గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది. అలా కొటక్‌లో మహీంద్రా అనే పేరు కలపడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? ఇదిగో ఇలా మీరెప్పుడైనా ఆలోచించారా?
ఉదయ్ సురేష్ కొటక్ (ఉదయ్ కొటక్) ఉన్నత మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించారు. వంట గది తరహాలో ఉండే ఇంట్లో 60 మంది కుటుంబ సభ్యులతో కలిసుండేవారు. అయితే ఉదయ్‌లో ఉన్న ప్రతిభకు పేదరికం ఎప్పుడూ అడ్డు కాలేదు. ఉన్నత చదువులు పూర్తి చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని అనుకున్నారు.
1985లో ఉదయ్ కొటక్‌కు పల్లవిలకు వివాహం జరిగింది.పెళ్లికి అప్పుడే హార‍్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. ఆనంద్ మహీంద్రాకు ఉదయ్ కొటక్‌కు కామన్ ఫ్రెండ్ ఉండేవారు. అతను ఉదయ్ సొంతంగా ఓ బ్యాంక్‌ను ప్రారంభించాలి’అని అనుకుంటున్న విషయాన్ని ఆనంద్ మహీంద్రాకు చెప్పారు. వెంటనే తన వద్ద ఉన్న లక్ష రూపాయల్ని ఉదయ్ కొటక్ ప్రారంభించబోయే సంస్థలో పెట్టుబడి పెట్టారు.
మొత్తం 30 లక్షలతో ప్రారంభమైన ఆ సంస్థకు తొలుత ఉదయ్ కోటక్, సిడ్నీ ఏఏ పింటో అండ్ కోటక్ & కంపెనీ పేరుతో కార్యకలాపాల్ని ప్రారంభించింది. ఆ తర్వాత అదే ఏడాది కొటక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా అవతరించింది. ఆ మరుసటి ఏడాది హరీష్ మహీంద్రా, ఆనంద్ మహీంద్రాలో వాటా కొనుగోలు చేశారు. ఆ కంపెనీ పేరు కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్‌గా 2003లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌గా ప్రసిద్ధి చెందింది.
ఆ బ్యాంక్ విలువ రూ.1.14లక్షల కోట్లకు చేరింది. కోటక్ మహీంద్రా గ్రూప్ నవంబర్ 1985లో కోటక్ గ్రూప్‌లో లక్ష పెట్టుబడి పెట్టారు. ఆ లక్ష పెట్టుబడి కాస్తా 2017 ఏప్రిల్ 1 నాటికి రూ.1,400 కోట్లుకు చేరింది. పలు ఇంటర్వ్యూల్లో ఆనంద్ మహీంద్రా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తాను తీసుకున్న మంచి పెట్టుబడి నిర్ణయాల్లో ఇదొకటని గుర్తు చేసుకుంటుంటారు.
1985. Young Uday Kotak enters my office&offers financing.He's so smart,I ask if I can invest in him.My Best decision https://t.co/cCfntHkiih
— anand mahindra (@anandmahindra) March 25, 2017
ప్రస్తుతం, పలు నివేదికల అంచనాల ప్రకారం.. కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఆనంద్ మహీంద్రా వాటా అక్షరాల రూ.2 వేల కోట్లుకు చేరినట్లు తెలుస్తోంది. మహీంద్రా కుటుంబ సభ్యుల పేరు మీద కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో మొత్తం 3.68 వాటా ఉంది.
ఇదీ చదవండి : నీకు జీవితాంతం రుణపడి ఉంటా