వంట పాత్రల్ని శుభ్రం చేసి..ఆరబెట్టే క్రాకరీ శానిటైజర్‌!

did you know Crockery Sanitizer how does it work - Sakshi

పింగాణి, గాజు వస్తువులను శుభ్రం చేయడం, భద్రపరచడం చాలా జాగ్రత్తతో చేయాల్సిన పని. పూర్తిగా తడి ఆరని ఈ వస్తువులపై సూక్ష్మజీవులు చేరే అవకాశాలూ ఎక్కువే! ఇలాంటి సున్నితమైన పింగాణి, గాజు వస్తువులను చక్కగా శుభ్రంచేసి, వాటిని పొడిగా ఆరబెట్టేందుకు జపానీస్‌ సంస్థ ‘యొకాయి’ ఈ క్రాకరీ శానిటైజర్‌ను రూపొందించింది.

డిష్‌వాషర్లు పాత్రలను శుభ్రం చేసే మాదిరిగానే, ఇది పింగాణి, గాజు పాత్రలను, వస్తువులను శుభ్రం చేస్తుంది. అవి శుభ్రమయ్యాక 60 డిగ్రీల ఉష్ణోగ్రత విడుదల చేసి, వాటిపై సూక్ష్మజీవులను నాశనం చేసి, పొడిగా ఆరబెడుతుంది. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. దీని పనితీరుపై పరీక్షలు కొనసాగిస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top