ఈ వారం ఐపీవోల టార్గెట్‌ రూ.21,000 కోట్లు

Details About This Week IPOs Paytm Sapphire latentview - Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌ మూడు ఐపీఓలతో పాటు రెండు లిస్టింగ్‌లు ఈ వారం సందడి చేయనున్నాయి. పేటీఎమ్‌ బ్రాండుతో డిజిటల్‌ సేవలందిస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌తో పాటు.. కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌ ఔట్‌లెట్ల నిర్వాహక కంపెనీ సఫైర్‌ ఫుడ్స్, ఐటీ సర్వీసుల సంస్థ లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.21,000 కోట్లను సమీకరించనున్నాయి. 

ఈ వారంలో రెండు లిస్టింగ్‌లు...  
గత వారంలో ఐపీఓను పూర్తి చేసుకున్న ఒమ్ని చానెల్‌ బ్యూటీ ప్రొడక్ట్‌ రిటైలర్‌ నైకా, ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ షేర్లు గురు, శుక్రవారాల్లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ కానున్నాయి. నైకా ఒక్కో షేరుకు రూ.1,085–రూ.1,125 మధ్య ధర శ్రేణిని నిర్ణయించి రూ.5,352 కోట్లను సమీకరించింది. ఇష్యూ 81.78 రెట్ల సబ్‌స్క్రిబ్షన్‌ను సాధించింది. గ్రే మార్కెట్లో ఇష్యూ గరిష్ట ధర(రూ.1,125)తో పోలిస్తే రూ.650 అధికంగా ట్రేడ్‌ అవుతున్నందుగా ప్రీమియం ధరతో లిస్ట్‌ కావచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఫినో పేమెంట్స్‌ ఒక్కో షేరును రూ.560 – రూ.577 ప్రైస్‌బ్యాండ్‌తో జారీ చేసి రూ. 1,200 కోట్లను సమీకరించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ 2.03 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.  
ఈవారం మార్కెట్‌లో ఐపీవోల వివరాలు
ఇష్యూ పేరు      ప్రారంభం       ముగింపు        ఇష్యూ సైజు 
పేటీఎమ్‌             సోమవారం             బుధవారం           రూ.18,300 కోట్లు 
సఫైర్‌ ఫుడ్స్‌        మంగళవారం          గురువారం           రూ. 2,073 కోట్లు 
లేటెంట్‌ వ్యూ      బుధవారం             శుక్రవారం             రూ. 600 కోట్లు  

చదవండి: 4 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా లీక్‌: సైబర్‌ఎక్స్‌9

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top