రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! | Delhi EV Policy 2026 2030 Tax Exemption on Electric Cars Under rs 30 Lakh | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

Apr 11 2026 2:58 PM | Updated on Apr 11 2026 3:25 PM

Delhi EV Policy 2026 2030 Tax Exemption on Electric Cars Under rs 30 Lakh

దేశ రాజధానిలో కాలుష్యం నుంచి విముక్తి పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కొత్తగా రూపొందించిన ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030’ ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. పర్యావరణ హితమే లక్ష్యంగా రూపొందించిన ఈ పాలసీలో సామాన్యులకు, మధ్యతరగతి వాహనదారులకు భారీ రాయితీలను ప్రకటించింది.

రూ.30 లక్షల లోపు కార్లకు పూర్తి రాయితీ

కొత్త ముసాయిదా విధానం ప్రకారం, ఢిల్లీలో రిజిస్టర్ చేసుకునే రూ.30 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్ ధర) విలువ కలిగిన అన్ని ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు లభించనుంది. ఈ ప్రయోజనం 31 మార్చి 2030 వరకు అమల్లో ఉంటుంది. రూ.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు ఈ రాయితీలు వర్తించవు. తద్వారా సామాన్య వాహనదారులకు ఈవీలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది.

హైబ్రిడ్ వాహనాలకూ ప్రోత్సాహం

కేవలం పూర్తిస్థాయి ఈవీలకే కాకుండా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. వీటిపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో 50 శాతం రాయితీని ప్రతిపాదించింది. దీనివల్ల ఇంధన వాహనాల నుంచి విద్యుత్ వాహనాల వైపు మళ్లే క్రమంలో హైబ్రిడ్ కార్లు ఒక వారధిగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

గాలి నాణ్యత మెరుగుదలే లక్ష్యం

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వాహన ఉద్గారాలను తగ్గించడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రాయితీలతోపాటు నగరం అంతటా ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, ఈవీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది భారతదేశపు నెట్-జీరో ఉద్గారాల లక్ష్యానికి, జాతీయ క్లీన్ మొబిలిటీ ప్లాన్‌కు అనుగుణంగా ఉంది.

ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement