Chandrayaan 3 Live Record In Youtube: చంద్రయాన్‌-3 మరో ఘనత, యూట్యూబ్‌లో టాప్‌ రికార్డ్‌

Chandrayan 3 Moon Mission Most live Viewed on YouTube - Sakshi

Chandrayaan-3 Youtube most viewed Record చంద్రయాన్ -3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన  కోట్లాదిమంది భారతీయుల కలల్ని సాకారం చేసింది. ఇస్రో. దీంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లపై అభినందనల వెల్లువ కురిసింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్‌ అయిన తొలి దేశంగా భారత్‌ ఖ్యాతిని దక్కించుకుంది.

జాబిల్లిపై భారతీయజెండాను రెపరెపలాడించేందుకు ఉద్దేశించిన ఈ చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్‌తో రూ. 615 కోట్లు. అతితక్కువ బడ్జెట్‌తో  అంతరిక్ష యాత్రల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది.  ప్రత్యేకించి 96.5 మిలియన్ల డాలర్ల బ చంద్రయాన్-2తో బడ్జెట్‌తో పోల్చినా ఇది తక్కువే కావడం విశేషం. మరో విశేషాన్ని కూడా చంద్రయాన్‌-3 మిషన్‌ సాధించింది.

యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రోగ్రాంగా ఘనతను దక్కించుకుంది. భారత ఇస్రో  చంద్రయాన్ -3 లైవ్‌ను ఏకంగా  8.06 మిలియన్లు మంది వీక్షించారని  తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది. 

ప్రత్యక్ష ప్రసారాన్ని  అత్యధికంగా చూసిన ఇతర కార్యక్రమాలు 
బ్రెజిల్ vs దక్షిణ కొరియా ఫుట్‌బాల్‌ ‍మ్యాచ్‌:  6.15 మిలియన్లు
బ్రెజిల్ vs క్రొయేషియా ఫుట్‌బాల్‌ ‍మ్యాచ్‌: : 5.2 మిలియన్లు
వాస్కో vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్‌ ‍మ్యాచ్‌ : 4.8  మిలియన్లు
అమెరికా స్పేస్‌ఎక్స్‌ క్రూ డెమో: 4.08  మిలియన్లు
 బీటీఎస్‌ బటర్‌  వెన్న: 3.75 M
యాపిల్‌ లైవ్‌ ఈవెంట్‌  3.69 M
జానీ డెప్ v అంబర్ ట్రయిల్‌ : 3.55 మిలియన్లు
ఫ్లుమినెన్స్ vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్‌ ‍మ్యాచ్‌ : 3.53 మిలియన్లు
కారియోకో చాంపియషన్‌ షిప్‌  ఫుట్‌బాల్‌ ‍మ్యాచ్‌  ఫైనల్: 3.25మిలియన్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top