ఐటీ ఫ్రెష‌ర్లకు గుడ్‌న్యూస్‌.. కాప్‌జెమినీలో 60 వేల ఉద్యోగాలు..!

Capgemini To Hire Over 60000 Employees in India in 2022 - Sakshi

ముంబై: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ కాప్‌జెమినీ గత ఏడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది భారత్‌లో 60వేల మందిని కొత్తగా నియమించుకొనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సరికొత్త నియామకాలతో తమ సంస్థ విలువ మరింత పెరుగుతందని కంపెనీ చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్'కి డిమాండ్ పెరగడంతో ఈ నియామకాలు చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నియామకాల్లో అనుభవం ఉన్న వారితోపాటు ఫ్రెషర్లు కూడా ఉండనున్నారని కంపెనీ పేర్కొంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అశ్విన్‌ యార్డి మీడియాకు వెల్లడించారు. 

కాప్‌జెమినీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగం మంది భారతీయులే కావడం విశేషం. 5జీ, క్వాంటం వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై సంస్థ దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. ఎరిక్సన్ భాగస్వామ్యంతో కాప్‌జెమినీ గత ఏడాది భారతదేశంలో 5జీ ల్యాబ్ ప్రారంభించింది అని అశ్విన్‌ అన్నారు. భార‌త్‌తోపాటు కొన్ని దేశాల్లోని క్ల‌యింట్ల‌కు 5జీ రంగ సేవ‌లు అందించేందుకు భారతీయ కంపెనీలతో కలసి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్వాంటం, 5జీ, మెటావ‌ర్స్ టెక్నాల‌జీల్లో సేవ‌లందించేందుకు సంస్థ స‌న్నాహాలు చేస్తున్న‌ది. కొత్త తరం టెక్నాలజీ నైపుణ్యాలు భారతదేశంలో చాలా ఉన్నాయి అని యార్డీ తెలిపారు. 

అదేవిధంగా, కాప్‌జెమినీ క్లౌడ్ & ఏఐ కోసం ఒక అకాడమీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ముంబయిలోని ఆఫీస్‌లో భారీగా స్థలం ఉంది. ఇది కాప్‌జెమినీకి భారత్‌లోనే ఉన్‌ అతిపెద్ద డెవలప్‌మెంట్‌ సెంటర్‌. దీనికి తోడు మిగిలిన చోట్ల కంపెనీకి ఉన్న సెంటర్లను కూడా పెంచుతుండటంతో కొత్త ఉద్యోగుల పోస్టింగ్‌లు ఇస్తున్నామని కంపెనీ సీఈవో అశ్విన్‌ పేర్కొన్నారు.

(చదవండి: అదిరిపోయిన హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. ధరెంతో తెలుసా?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top