'బీఆర్‌ శెట్టి' కి భారీ షాక్‌, వెయ్యికోట్ల జరిమానా!

Barclays Won 131 Million Legal Fight Against Bavaguthu Raghuram Shetty - Sakshi

ఇండియన్‌ అబుదాబీ బిలీనియర్ బావగుతు రఘురామ్ శెట్టి అలియాస్‌ బీఆర్‌ శెట్టికి భారీ షాక్‌ తగిలింది. ఫారన్‌ ఎక్ఛేంజ్‌ బిజినెస్‌ ట్రాన్సాక్షన్‌లలో భాగంగా లండన్‌ బ్యాంక్‌ బార్‌క్లేస్‌ కు మొత్తం చెల్లించాలని లండన్‌ కోర్ట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీఆర్‌ శెట్టి బార్‌క్లేస్‌కు 131మిలియన్లు చెల్లించాల్సి( ఇండియన్‌ కరెన్సీలో రూ.9,68,27,99,500) ఉంటుంది.  
 
2020లో లంబన్‌ బ్యాంక్‌ బార్‌క్లేస్‌ ఫారన్‌ ఎక్ఛేంజ్‌ బిజినెస్‌ ట్రాన్సక్షన్‌ల ఒప్పొందంలో భాగంగా బీఆర్‌శెట్టి సదరు బ్యాంక్‌కు పెద్దమొత్తంలో చెల్లించాల్సి ఉంది. ఇదే అంశంపై దుబాయ్‌ న్యాయస్థానం బీఆర్‌శెట్టికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో దుబాయ్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ లండన్‌ కోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ కేసుపై గత నెల డిసెంబర్‌లో యూకే కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బీఆర్‌ శెట్టి తరుపు న్యాయ వాదులు తన క్లయింట్‌ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, తీర్పును వాయిదా వేయాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు..కేసును జనవరి 10,2022కి వాయిదా వేసింది. 

నిన్న మరోసారి విచారణ చేపట్టిన లండన్‌ కోర్ట్‌ బీఆర్‌ శెట్టి అ‍భ్యర్ధనను తిరస్కరించింది. ఈ సందర్భంగా బార్‌క్లేస్‌కు చెల్లించాల్సి ఉన్నా..తన క్లయింట్‌ బీఆర్‌ శెట్టి ఆస్తులు స్తంభించి పోయాయని, తీర్పును మరోసారి వాయిదా వేసేలా కోర్టుకు విన్నవించుకున్నారు. కానీ లండన్‌ కోర్టు ఆ అభ్యర్ధనను తిరస్కరించింది. బీఆర్‌ శెట్టి బ్యాంక్‌ బార్‌క్లేస్‌కు 131మిలియన్లు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఇండియాతో పాటు, మిగిలిన దేశాల్లో,లండన్‌లో ఉన్న బీఆర్‌ శెట్టి ఆస్తుల్ని స్తంబించేలా బార్‌క్లేస్‌ బ్యాంకు ప్రతినిధులు కోర్టు నుంచి అనుమతి పొందారు. 

బీఆర్‌ శెట్టి ఎవరు?
బావగుతు రఘురామ్ షెట్టి(బీఆర్‌‌‌‌‌‌‌‌ షెట్టి) లగ్జరీ లైఫ్‌‌‌‌కు పెట్టింది పేరు. లేని ఆస్తుల్ని ఉన్నాయని చూపించి లగ్జీరీ లైఫ్‌ను అనుభవించడంలో ఆయనకు ఆయనే సాటి.  కర్ణాటక రాష్ట్రం ఉడిపి చెందిన సాధారణ కుటుంబంలో జన్మించాడు. తనకున్న విద్యా అర్హతలతో ఫార్మా రంగంలో సేల్స్‌మాన్‌గా జీవితాన్ని ప్రారంభించాడు.

ఉడిపి నుంచి 1973లో యూఏఈకి వెళ్లి అక్కడే ఫార్మసీలో క్లినికల్ డిగ్రీ పుచ్చుకున్నాడు. అనంతరం 1975లో అబుదాబిలో సొంతగా ‘ఎన్ఎంసీ హెల్త్(న్యూ మెడికల్‌ సెంటర్‌)' పేరిట ఒక మెడికల్ నెట్‌వర్క్‌ను కంపెనీని స్థాపించాడు. అనతికాలంలో వేలకోట్ల ఆస్తుల్ని సంపాదించాడు. 2019లో ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఆయన ఇండియాలో 42వ ధనికుడు, అబుదాబీలో ఐదుగురు భారతీయ సంపన్నుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం 19 దేశాలలో 194 ఆసుపత్రులు ఉన్నాయి. కానీ సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు కోటీశ్వరుడి నుంచి పచ్చి మోసగాడిగా అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాడు.

చదవండి: కంపెనీలో ఫుడ్‌ సర్వ్‌ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top