బ్యాంక్‌ కస్టమర్లకు వార్నింగ్‌.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్‌ చేసేయండి!

Banks Warning: Advisories Against Sova Trojan Virus Android Users To Save Money - Sakshi

టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పాటు ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పాటు బ్యాంకులు కూడా ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లోన్‌లోనూ వారి సేవలను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీలు అధికమయ్యాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నుంచి దుకాణాల్లో చెల్లింపులు, ఇ-కామర్స్‌ సంస్థల్లో కొనుగోళ్లు అన్నీ డిజిటల్‌ రూపంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా హ్యకర్లు బ్యాంకింగ్‌ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించారు. మొబైల్‌ ఫోన్లకు వివిధ రకాలుగా మెసేజ్‌లు పంపుతున్నారు. కస్టమర్లు కూడా అవి వైరస్ లింకులని తెలియక క్లిక్‌ చేసి వారి ఫోన్‌లో ఉన్న బ్యాంకింగ్‌ యాప్‌ల సమాచారం నేరగాళ్లకు చేరేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. చివరికి ఖాతాలు ఖాళీ అయ్యాక లోబదిబోమంటున్నారు.
 

బ్యాంకింగ్‌ యాప్‌లే లక్ష్యం.. జర జాగ్రత్త గురూ
తాజాగా బ్యాంకింగ్‌ యాప్‌లే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు ‘సోవా’ (SOVA) అనే వైరస్‌ లింకులను మెసేజ్‌ రూపంలో ఫోన్లకు పంపుతున్నారు. అది క్లిక్‌ చేయగానే బ్యాంకింగ్‌ యాప్‌ల పాస్‌వర్డ్‌, లాగిన్‌ వివరాలతో పాటు పాస్‌వర్డ్‌ కూడా నేరగాళ్లకు చేరుతోంది. ఈ విషయంపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని పలు బ్యాంకులు హెచ్చరికలు జారీ చేశాయి. సోవా వైరస్‌ పలు రకాలుగా బ్యాంకింగ్‌, పేమెంట్‌ లావాదేవీలను గుర్తించడంతో పాటు క్రిప్టోకరెన్సీ వాలెట్లనూ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు బయటపడింది.

బ్యాంకులు ఏమంటున్నాయంటే..
అనధికారిక వెబ్‌సైట్లలో ఉండే ఏ లింక్‌పై కూడా క్లిక్ చేయడం మంచిది కాదని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎస్‌బిఐ, యాక్సిస్‌, వంటి బ్యాంకింగ్‌ యాప్‌లు కూడా కేవలం అఫిషియల్‌ ప్లే స్టోర్, అధికారిక వైబ్‌సైట్ల నుంచి మాత్రమే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర వెబ్‌సైట్ల నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుతున్నా, లేదా డౌన్‌లోడ్‌ చేసుకుని ఉన్న ప్రమాదమేనని, అలాంటి యాప్‌లను వెంటనే డెలీట్‌ చేయడం ఉత్తమమని చెప్తున్నాయి.

ఎలా పని చేస్తుంది ఈ వైరస్‌..
ఎస్బీఐ(SBI) తెలిపిన సమాచారం ప్రకారం.. సోవా(SOVA) అనేది ఒక ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్. ఇది బ్యాంకు యాప్స్‌లోకి వెళ్లి కస్టమర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తుంది. అంతేకాకుండా యూజర్ల పర్సనల్ క్రెడెన్షియల్స్ అయిన లాగిన్‌, పాస్‌వర్డ్‌ వంటి ముఖ్యవివరాలను కూడా గ్రహించి వారి అకౌంట్లలోకి యాక్సెస్ పొందుతుంది. ఒకసారి ఈ వైరస్ ప్రవేశిస్తే మీ బ్యాంక్‌ ఖాతాను ఖాళీ చేస్తుంది. అందుకే ముందుగానే ఈ వైరస్‌ని మొబైల్‌లోకి రాకుండా  చర్యలు తీసుకోవడం ఉత్తమం.

చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్‌.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top