బ్యాంకులకు వెళ్లేవాళ్లకు అలర్ట్‌: 11 రోజులు సెలవులు! | Bank Holidays In June 2026 Banks To Remain Close For 11 Days | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు వెళ్లేవాళ్లకు అలర్ట్‌: 11 రోజులు సెలవులు!

May 30 2026 10:42 AM | Updated on May 30 2026 1:02 PM

Bank Holidays In June 2026 Banks To Remain Close For 11 Days

బ్యాంకులు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రతిఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకు బ్రాంచిలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయి.. అనే విషయాలను తెలుసుకోవడం అవసరం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు జూన్ నెలలో గత నెలలతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా కొన్ని ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులు మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం మంచిది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉండగా, మిగిలిన రోజులు రాష్ట్రాల వారీగా అమలయ్యే ప్రత్యేక సెలవులు.

మొహర్రం ప్రధాన సెలవు

జూన్ 26న మొహర్రం (అషూరా) సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు మూసిఉంటాయి. ఇది జూన్ నెలలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రధాన సెలవుగా భావించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సెలవు జూన్ 25న ఉండగా, ఇతర చాలా రాష్ట్రాల్లో జూన్ 26న అమలులో ఉంటుంది.

జూన్‌లో బ్యాంకు సెలవులు

జూన్ 7 - ఆదివారం
జూన్ 13 - రెండో శనివారం
జూన్ 14 - ఆదివారం
జూన్ 15 – మిజోరాంలో వైఎంఏ దినోత్సవం, ఒడిశాలో రాజ సంక్రాంతి సందర్భంగా సెలవు
జూన్ 21 - ఆదివారం
జూన్ 25 – ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సెలవు
జూన్ 26 – మొహర్రం/అషూరా సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవు
జూన్ 27 - నాలుగో శనివారం
జూన్ 28 - ఆదివారం
జూన్ 29 – హిమాచల్ ప్రదేశ్‌లో సంత్ గురు కబీర్ జయంతి
జూన్ 30 – మిజోరాంలో రెమ్నా నీ శాంతి దినోత్సవం

అందుబాటులో ఆన్‌లైన్ సేవలు

బ్యాంకు శాఖలు మూసిఉన్నప్పటికీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్, పాస్‌బుక్ అప్‌డేట్‌లు, ఖాతా సంబంధిత సేవలు వంటి బ్రాంచ్‌ ఆధారిత పనులు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు.

అనేక సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుండటంతో ఖాతాదారులు తమ ప్రాంతీయ బ్యాంకు శాఖల సెలవుల జాబితాను ముందుగానే పరిశీలించడం మంచిది. ఏవైనా అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉంటే సెలవుల తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆర్‌బీఐ సూచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement