వైద్య రంగంలోకి బజాజ్‌ గ్రూప్‌ | Bajaj Group Enters Healthcare Sector With ₹2,500 Crore Hospital Plan In Pune | Sakshi
Sakshi News home page

వైద్య రంగంలోకి బజాజ్‌ గ్రూప్‌

May 28 2026 3:48 PM | Updated on May 28 2026 4:06 PM

Bajaj Group Enters Healthcare

బజాజ్‌ గ్రూప్‌ ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అడుగు పెడుతోంది. రూ.2,000–2,500 కోట్లతో వచ్చే మూడేళ్ల కాలంలో పుణెలో హాస్పిటల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు బజాజ్‌ ఇంటెగ్రేటెడ్‌ హెల్త్‌ సిస్టమ్‌ ఎండీ నీరవ్‌ బజాజ్‌ ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో 12 పట్టణాల్లోకి సేవలను విస్తరిస్తామని తెలిపారు. క్లినిక్‌లు, అంబులేటరీ సేవలు, హోమ్‌కేర్‌ (ఇంటివద్దే వైద్య సేవలు), హాస్పిటల్‌తో కూడిన ఆరోగ్య సంరక్షణ నమూనాను రూపొందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు.

వ్యాధుల నివారణ నుంచి తక్షణ చికిత్స వరకు ఆస్పత్రికి దూరంగా సేవలను అందించాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ ఆరోగ్య సంరక్షణ నమూనా చాలా భిన్నమైందంటూ దీన్ని సొంతంగానే నిర్మింకుంటామని చెప్పారు. పడకల సంఖ్య, ఒక్కో పడకవారీ ఆదాయం తదితర సంప్రదాయ కొలమానాలను తాము అనుసరించబోమన్నారు. ప్రస్తుతమున్న హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement