ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో

On August 15 is Ola Going To launch electric Car - Sakshi

సాక్షి, ముంబై: క్యాబ్‌ సేవలు, ఎలక్ట్రిక్ బైక్స్‌తో  హవాను చాటుకుంటున్న  ఓలా త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ ​కారును లాంచ్‌ చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్ట్ 15న ఒక స్పోర్టీ ఎలక్ట్రిక్  కారును ఆవిష్కరించ నుందని తెలుస్తోంది. ఈ మేరకు ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా ద్వారా  సమాచారాన్ని వెల్లడించారు. 

భవిష్ అగర్వాల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, కార్ లాంచింగ్‌ను ధ్రువీకరించారు. 75వ స్వాతంతత్ర్య   దినోత్సవం సందర్భంగా కొత్త ప్రొడక్ట్‌ను ఇండియాలో లాంచ్ చేయ నున్నట్లు ట్వీట్‌ చేశారు. దీంతో పాటు అతి చౌక ధరలో కొత్త ఎస్‌1 స్కూటర్‌ను తీసుకురానుందని సమాచారం. ఆగస్టు 15న మేము ఏమి ప్రారంభించ బోతున్నామో ఊహించగలరా? అంటూ ట్వీట్‌ చేసిన భవీష్‌​ అగర్వాల్‌ నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అలాగే లాంచ్ ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లోస్ట్రీమ్ చేయనున్నామని, సంబంధిత వివరాలను త్వరలోనే వెల్లడి స్తామన్నారు.

ఓలా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కాన్సెప్ట్
తక్కువ ధరలో కొత్త S1, భారతదేశపు అత్యంత స్పోర్టియస్ట్ కారు, సెల్ ఫ్యాక్టరీ ,  S1లో కొత్త ఉత్తేజకరమైన రంగుఅంటూ నాలుగు హింట్స్‌ ఇచ్చారు. దీంతో ఈ నాలింటిని  పరిచేయనుందనే అంచనాలు మార్కెట్‌ వర్గాలు నెలకొన్నాయి.  స్పోర్టీ ఎలక్ట్రిక్ కారు 10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుందట. అలాగే ఈ ఆగస్ట్ 15న ఫ్యూచర్ ఫ్యాక్టరీలో సెల్ తయారీ ప్లాంట్, కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికలతో సహా అనేక కార్యకలాపాలను వెల్లడించవచ్చని భావిస్తున్నారు.  కాగా ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త ఫోర్-వీలర్ లాంచింగ్‌పై గత కొద్ది కాలంగా అప్‌డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓలా  ఇండియాలో ఎస్1, ఎస్1 ప్రో, అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. 


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top