'మోంథా' తుఫాను సమయంలో బలహీన వర్గాల ప్రజలను రక్షించడంలో మరియు ఆర్థిక నష్టాన్ని తగ్గించడంలో రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.
తుఫానులు, వరదలు, ఇతర ప్రమాదాల గురించి అప్రమత్తం చేసి, వారి ప్రాణాలను, జీవనోపాధిని రిలయన్స్ ఫౌండేషన్ కాపాడుతుంది. 'మోంథా' తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపిస్తున్న సమయంలో, తుఫాను తీరం దాటడానికి మూడు రోజుల ముందు, అంటే అక్టోబర్ 25 నుంచే, రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖలు, ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, INCOIS & IMDతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ సకాలంలో హెచ్చరిక సందేశాలను, జాగ్రత్త సలహాలను అందించింది. తుఫాను ప్రభావం తగ్గించడానికి కృషి చేసిన అన్ని సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు.
తుఫాను సమయంలో తమ ప్రయత్నాలలో భాగంగా, రిలయన్స్ ఫౌండేషన్ 1.65 లక్షల మంది రైతులు & సముద్ర మత్స్యకారులను చేరుకుంది. వీరిలో అప్పటికే సముద్రంలో ఉన్నవారు కూడా ఉన్నారు. తుఫాను సమీపిస్తున్న తీరు, గాలి, సముద్ర పరిస్థితుల గురించి వారికి నిర్దిష్ట సమాచారం అందించింది. తుఫాను మార్గంలో ఉన్న మత్స్యకారులకు ఒడ్డుకు తిరిగి రావడానికి, వారి పడవలు, వలలు మరియు ఇతర ఆస్తులను భద్రపరచడానికి సహాయపడే లక్ష్యంగా మొబైల్ ఆధారిత సలహాలను అందించారు.
రియల్ టైమ్ సమాచారాన్ని అందించడానికి 24/7 పనిచేసిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ అక్టోబర్ 26 - 28 మధ్య 600 పైగా కాల్స్‌కు స్పందించింది. భారతదేశం అంతటా గ్రామీణ సమాజాల సంక్షేమానికి కట్టుబడి ఉన్న రిలయన్స్ ఫౌండేషన్, ఒక దశాబ్దానికి పైగా, ప్రమాదాల సమయంలో ప్రాణ, జీవనోపాధి నష్టాన్ని నివారించడానికి కీలక సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది.


