టెక్‌ దిగ్గజం యాపిల్‌ కో-ఫౌండర్‌కి గుండెపోటు!

Apple Co-founder Steve Wozniak Suffered Possible Stroke - Sakshi

వోజ్‌నియాక్‌ గుండెపోటుకు గురవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు యాపిల్‌ కో-ఫౌండర్‌ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా వోజ్‌నియాక్‌  గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

➤వోజ్‌గా సుపరిచితులైన వోజ్‌నియాక్‌  1976లో టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మరో యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ స్టీవ్‌జాబ్స్‌తో కలిసి వోజ్‌నియాక్‌  తొలి యాపిల్‌ కంప్యూటర్‌ను తయారు చేశారు.   

➤ యాపిల్‌  కంప్యూటర్‌ 2 డిజైనింగ్‌లో వోజ్‌నియాక్‌  ప్రముఖ పాత్ర పోషించారు. అదే కంప్యూటర్‌.. పర్సనల్‌ కంప్యూటర్ల విభాగంలో సరికొత్త రెవెల్యూషన్‌ను క్రియేట్‌ చేసింది. ఇంజినీరింగ్‌ ఇన్నోవేషన్స్‌తో యాపిల్‌ను ప్రపంచంలో నెంబర్‌ వన్‌ టెక్‌ కంపెనీగా అవతరించేలా కృషి చేశారు. 

➤ అయినప్పటికీ 1985లో వోజ్‌నియాక్‌ యాపిల్‌ సంస్థ నుంచి బయటకు వచ్చారు. పర్సనల్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ తన దృష్టికి అనుగుణంగా లేదని భావించారు. ఆ తర్వాత మొదటి యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌ను అభివృద్ధి చేసిన సీఎల్‌ 9 ని స్థాపించడంతో పాటు సహా కొత్త వెంచర్‌లను ప్రారంభించారు.   
  
➤ వోజ్‌నియాక్‌   టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో విశేషమైన కృషి చేసినందుకు గాను 11 డాక్టరేట్లు సొంతం చేసుకున్నారు. 

➤ కాలేజీ చదివే రోజుల్లో యాపిల్‌ కో-ఫౌండర్‌కి క్రీమ్‌ సోడా అంటే మహా ప్రీతి. అందుకే దాని పేరుమీద ‘క్రీమ్‌ సోడా కంప్యూటర్‌’ పేరుతో ఓ కంప్యూటర్‌ను తయారు చేశారు. ఆ కంప్యూటర్‌కి కీబోర్డ్‌, స్క్రీన్‌లు ఉండవు. పంచ్‌ కార్డ్‌ ప్రోగ్రామ్‌తో దీనిని ఆపరేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రీమ్‌ సోడా కంప్యూటర్‌ యాపిల్‌ తన తొలి యాపిల్‌ కంప్యూటర్‌ను విడుదల చేయడానికి కారణమైంది. 

➤ 1981లో స్వల్ప విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదంతో సదరు విమానంలో ఉన్న  వోజ్‌నియాక్‌  మతి స్థిమితం కోల్పోయారు. తర్వాత కొన్ని వారాలకు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నారు. మతి మరుపుతో విమన ప్రమాదం జరగడం, మతి స్థిమితం కోల్పోవడం గురించి మరిచిపోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 
 

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top