Anand Mahindra Watches Child Enjoying Monsoon in Viral Video - Sakshi
Sakshi News home page

Anand Mahindra: చిన్నారి చేష్టలకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. నెట్టింట్లో వైరల్ వీడియో!

Jun 27 2023 7:02 PM | Updated on Jun 27 2023 8:10 PM

Anand Mahindra twitter video viral - Sakshi

Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి అందరికి తెలుసు. ఈయన తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ.. అప్పుడప్పుడు కొంతమంది ప్రశ్నలకు రిప్లై ఇస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఒక వీడియో తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసాడు. ఆరు సెకన్ల వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఋతుపవనాలు మొదలయ్యాయి, ఇప్పటికే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భానుడి భగభగలకు అల్లాడిపోయిన జనం ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ చిన్నారి చిరు జల్లులలో తడుస్తూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ సంఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!)

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొంత మంది తమ కామెంట్లను కూడా షేర్ చేశారు. వర్షాకాలంలో ముంబై ఒక అట స్థలంగా మారుతుందని, చిన్న నాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చాయని రకరాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement