నవ్వు తెప్పిస్తున్న'ఆనంద్ మహీంద్రా' ఎక్స్(ట్విటర్) వీడియో | Anand Mahindra Twitter Video | Sakshi
Sakshi News home page

నవ్వు తెప్పిస్తున్న'ఆనంద్ మహీంద్రా' ఎక్స్(ట్విటర్) వీడియో

Published Sun, Nov 5 2023 4:18 PM | Last Updated on Sun, Nov 5 2023 5:03 PM

Anand Mahindra Twitter Video - Sakshi

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎలుగుబంటి తనను తాను అద్దంలో చూసుకుని ఒక్కసారిగా కంగారుపడిపోయింది. వెంటనే దాని ముందు తనలాంటిదే ఇంకొకటుందని అద్దం వెనుకకు వెళ్లి చూసింది. అక్కడ కనిపించకపోయేసరికి అద్దాన్ని పట్టుకుని బలంగా కిందకు లాగింది.

ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్‌.. విర‌క్తితో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఇప్పుడు ల‌క్ష‌ కోట్ల కంపెనీకి బాస్

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటుంటారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ ఆదివారాల్లో మరీ ఉదయాన్నే లేచినపుడు తన రియాక్షన్ కూడా ఇలానే ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement