టెన్నిస్‌ స్టార్‌పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌: ఎలా మొదలు పెట్టిందో అలానే..

Anand Mahindra Monday Motivationpostlauds Sania Mirza Career - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త , ఎం అండ్‌ ఎం ఆనంద్‌ మహీంద్ర ఎపుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోలోయర్లకు ప్రేరణగా నిలుస్తుంటారు. స్ఫూర్తిదాయక కంటెంట్‌ను పంచు కుంటారు. అలాగే వినూత్న ఆవిష్కరణలు, జీవిత సలహాలు, ఒక్కోసారి ఫన్నీ వీడియోలు పంచుకుంటూ అందర్నీ ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా ట్విటర్‌లో ఒక సీక్రెట్‌ను రివీల్‌ చేశారు. టెన్నిస్‌ సంచలన సానియా మీర్జా తనకు స్ఫూర్తి అంటూ ట్వీట్‌  చేశారు. 

ఆనంద్‌మహీంద్ర మండే మోటివేషన్‌:  గెలవాలనే ఆకలి ఏ దశలోనూ చచ్చిపోకూడదు!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ తన "మండే మోటివషన్‌"ని టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై స్ఫూర్తిదాయక పోస్ట్‌ షేర్‌ చేశారు. విజయం సాధించాలనే ఆకలితో ఆటను ఎలా ప్రారంభించిందో  అదే ఉత్సాహంతో తన కరియర్‌ని ముగించిందంటూ కితాబిచ్చారు. అంతేకాదు తాను కూడా తన కెరీర్‌లో ఈ దశలోనైనా రాణించాలనే కోరికను సజీవంగా ఉంచుకోవాలనే విషయాన్ని గుర్తు చేసిందని మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా "పోటీ నా రక్తంలో ఉంది.. కోర్టులో అడుగుపెట్టిన ప్రతిసారీ నేను గెలవాలనే కోరుకుంటా.. అది  చివరి గేమా లేక చివరి సీజనా అనే దానితో సంబంధం లేకుండా విజయాన్నే కోరుకుంటా’ అనే కోట్‌ ఉన్న సానియా ఫోటోను కూడా షేర్‌ చేయడం విశేషం.దీంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.  

లక్షా 40వేలకు పైగా వ్యూస్‌ని, రెండువేలకు పైగా లైక్‌లను పొందింది. చాలామంది ఆనంద్‌ మహీంద్ర అభిప్రాయంతో ఏకీభవించారు, "అద్భుతమైన క్రీడాకారిణి" అంటూ సానియాను అభివర్ణించారు.  కాగా తన సుదీర్ఘ కరియర్‌లో అనేక టైటిల్స్‌ని, గ్రాండ్‌స్లాం ట్రోఫీలను గెల్చుకున్న సానియా మీర్జా ఇటీవల  రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top