2022 తరువాత.. అతిపెద్ద లేఆఫ్స్! | Amazon Plans Major Layoffs, 30K Jobs To Be Cut Amid Cost Cutting Measures, More Details Inside | Sakshi
Sakshi News home page

2022 తరువాత.. అతిపెద్ద లేఆఫ్స్!

Oct 28 2025 7:35 AM | Updated on Oct 28 2025 10:39 AM

Amazon To Lay Off 30000 Corporate Employees

2025 దాదాపు ముగుస్తున్నా.. లేఆఫ్స్  మాత్రం తగ్గడం లేదు. అమెజాన్ కంపెనీ ఈ వారం నుంచి 30,000 ఉద్యోగులను తగ్గించడానికి సన్నద్ధమవుతోందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదించింది. 2022 తరువాత సంస్థ అతిపెద్ద ఉద్యోగుల తొలగింపు బహుశా ఇదే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెజాన్ కంపెనీ తమ మొత్తం కార్పొరేట్ ఉద్యోగులలో 10 శాతం తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయం ఈమెయిల్ నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఉద్యోగాల తొలగింపులు ప్రారంభయ్యే అవకాశం ఉంది. గత రెండు సంవత్సరాలుగా అమెజాన్.. చిన్న మొత్తంలో ఉద్యోగాలను తగ్గిస్తున్నప్పటికీ, ఇప్పుడు మాత్రం భారీ లేఆఫ్స్​కు సిద్దమైంది.

కంపెనీ ఖర్చులను తగ్గించడంలో భాగంగానే.. అమెజాన్ ఈ ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. హెచ్ఆర్ విభాగంలో సుమారు 15 శాతం తగ్గించనున్నారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడం వల్ల.. మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీసే అవకాశం ఉందని జూన్‌లో సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 15.5 లక్షలు. 2022 చివరిలో అమెజాన్ 27,000 ఉద్యోగాలను తొలగించింది.

216 కంపెనీలు.. 98,000 ఉద్యోగాలు
లేఆప్స్.ఎఫ్వైఐ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 216 కంపెనీలలో దాదాపు 98,000 ఉద్యోగాలు పోయాయని అంచనా. కాగా 2024లో ఈ సంఖ్య 153,000. ఉద్యోగుల తొలగింపులు జాబితాలో కేవలం అమెజాన్ మాత్రమే కాకుండా.. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: రూ. 299తో 35జీబీ డేటా: ఉచితంగా జియోఫై డివైజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement