Amazon Incredible Offer: Here's How To Grab Samsung Galaxy A23 Under Rs 10,000 - Sakshi
Sakshi News home page

బంపరాఫర్‌ : రూ.23వేల ఫోన్‌ రూ.10వేలకే సొంతం చేసుకోండిలా!

Published Fri, Apr 14 2023 5:39 PM

Amazon Incredible Offer: Know How To Grab Samsung Galaxy A23 For Under Rs 10000 - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మరో సరికొత్త సేల్‌తో ముందుకు వచ్చింది. ఏప్రిల్‌ 14 నుంచి ఏప్రిల్‌ 17 వరకు జరిగే ఈ సేల్‌లో వైడ్‌ రేజ్‌ స్మార్ట్‌ ఫోన్‌ల నుంచి ప్రీమియం ఫోన్‌లపై 40 శాతం భారీ డిస్కౌంట్‌ అందిస్తుంది. ఈ సేల్‌లో ఇటీవలే విడుదలైన శాంసంగ్‌ గెలాక్సీ ఏ23పై బంపరాఫర్‌ ప్రకటించింది. రూ.10వేల కంటే ధరకే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.  (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!)

తగ్గిన  5జీ శాంసంగ్‌ గెలాక్సీ ఏ23 ధరలు 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్‌ గెలాక్సీ ఏ23 5జీ  6జీబీ ర్యామ్‌ అండ్‌ 128జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ అసలు ధర రూ.23,990కే  ఉండగా సేల్‌లో 27 శాతం డిస్కౌంట్‌తో  రూ.17499కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్‌ చేస్తే రూ.1000 ఇన్‌ స్టంట్‌  డిస్కౌంట్‌ హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌ బ్యాక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై 5శాతం డిస్కౌంట్‌ తో పాటు ఇతర ఆఫర్లు కలుపుకుంటే రూ.16499కే సొంతం చేసుకోవచ్చు.   


చదవండి👉 అమెజాన్‌లో ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్!


శాంసంగ్‌ గెలాక్సీ ఏ23 ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ 
పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను పొందవచ్చు. ఎక్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ కింద రూ.16300 డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న ఫోన్‌ పనితీరు బాగుంటే శాంసంగ్‌ గెలాక్సీ ఏ23ని ఎక్ఛేంజ్‌ ఆఫర్‌, ఇతర బ్యాంక్‌ ఆఫర్లతో రూ.10వేలకే కొనుగోలు చేసే వెసలు బాటు కల్పించింది అమెజాన్‌  

శాంసంగ్‌ గెలాక్సీ ఏ23 ఫీచర్లు 
శాంసంగ్‌ గెలాక్సీ ఏ23లో 120హెచ్‌ జెడ్‌ రిఫ్రెష్‌ రేటుతో  6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ ప్లస్‌- వీ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 చిప్‌ సెట్‌, 16జీబీ ర్యామ్‌, ఫోటోగ్రఫీ కోసం అల్ట్రా వైడ్‌, డెప్త్‌, మ్యాక్రోలెన్సెస్‌లతో 50 ఎంపీ క్వాడ్‌ రేర్‌ కెమెరా సెటప్‌ ఉంది.

ఇదీ చదవండి: పనిమనుషులకు హెలికాప్టర్‌లో ఐలాండ్‌ ట్రిప్‌, వైరల్‌వీడియో

Advertisement
 
Advertisement
 
Advertisement