
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ 'ఫెస్టివల్ సేల్స్' ప్రకటించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే.. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తాయి.
అమెజాన్ ఫెస్టివల్ సేల్ తేదీని అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది నవరాత్రి & దీపావళి పండుగ సీజన్‌లో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎప్పటిలాగానే.. ప్రైమ్ సభ్యులకు సేల్ ప్రారంభమయ్యే 24 గంటల ముందు యాక్సెస్ లభిస్తుంది.
బ్లాక్‌బస్టర్ డీల్స్, ట్రెండింగ్ డీల్స్, టాప్ 100 డీల్స్ వంటి అనేక రకాల సదుపాయాలను అమెజాన్ అందించనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపుతో పాటు ఈఎంఐ లావాదేవీలతో సహా ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి.
ఇదీ చదవండి: ఆగస్టులో రూ.24 లక్షల కోట్లు: యూపీఐ ఆల్‌టైమ్ రికార్డ్
ఇక ఫ్లిప్‌కార్ట్ విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు, కెమెరాలు మొదలైనవాటి మీద.. అద్భుతమైన డిస్కౌంట్‌లు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సేల్ తేదీకి సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ సేల్ ప్రారంభమవ్వనికి ముందే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు షాపింగ్ చేయడానికి యాక్సెస్ లభిస్తుంది.