
నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్‌పీఐ) హెచ్చరిక జారీ చేసింది. స్టార్ హెల్త్ నుంచి ఆస్పత్రులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావించింది. ఏహెచ్‌పీఐలో 1,500 ప్రైవేటు ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి.
చికిత్సల ధరలను తగ్గించాలంటూ ఒత్తిడి చేయడం, డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధమైన ప్రశ్నలు, నగదు రహిత క్లెయిమ్‌లకు ఆమోదం తెలిపి, తుది బిల్లులో అడ్డమైన కోతలు విధించడం వంటి చర్యలతోపాటు.. నగదు రహిత చికిత్సలను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం చేస్తున్నట్టు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దృష్టికి ఏహెచ్‌పీఐ తీసుకెళ్లింది. కాగా, ఏహెచ్‌పీఐ నిర్ణయం ఏకపక్షం, దురదృష్టకరంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాఖ్యానించింది. పాలసీదారులు స్టార్ హెల్త్ ద్వారా సేవలు పొందడంపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.