టీవీ ప్రకటనలు గతేడాది 22% అప్‌

After COVID-19, TV ad volumes grow 22 percent in 2021 - Sakshi

బార్క్‌ వెల్లడి

ముంబై: కోవిడ్‌–19 మహమ్మారితో 2020లో టీవీ ప్రకటనలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినప్పటికీ 2021లో మాత్రం యాడ్‌ల పరిమాణం గణనీయంగా పుంజుకుంది. 22 శాతం పెరిగి 1,824 మిలియన్‌ సెకన్లుగా నమోదైంది. బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) సోమవారం ఈ విషయాలు వెల్లడించింది. టీవీ ప్రకటనల పరిమాణం 2019లో 1,542 మిలియన్‌ సెకన్లుగా ఉండగా 2020లో 1,497 మిలియన్‌ సెకన్లకు తగ్గింది. టీవీలో మొత్తం 9,239 ప్రకటనకర్తలు.. 14,616 బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్‌ ఇచ్చారు. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ విభాగం ప్రకటనలు (1,117 మిలియన్‌ సెకన్లు) అత్యధికంగా ఉండగా, 185 మిలియన్‌ సెకన్లతో ఈ–కామర్స్, నిర్మాణ రంగ ప్రకటనలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top