breaking news
TV advertisement
-
టీవీ ప్రకటనలు గతేడాది 22% అప్
ముంబై: కోవిడ్–19 మహమ్మారితో 2020లో టీవీ ప్రకటనలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినప్పటికీ 2021లో మాత్రం యాడ్ల పరిమాణం గణనీయంగా పుంజుకుంది. 22 శాతం పెరిగి 1,824 మిలియన్ సెకన్లుగా నమోదైంది. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సోమవారం ఈ విషయాలు వెల్లడించింది. టీవీ ప్రకటనల పరిమాణం 2019లో 1,542 మిలియన్ సెకన్లుగా ఉండగా 2020లో 1,497 మిలియన్ సెకన్లకు తగ్గింది. టీవీలో మొత్తం 9,239 ప్రకటనకర్తలు.. 14,616 బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ ఇచ్చారు. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగం ప్రకటనలు (1,117 మిలియన్ సెకన్లు) అత్యధికంగా ఉండగా, 185 మిలియన్ సెకన్లతో ఈ–కామర్స్, నిర్మాణ రంగ ప్రకటనలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఎత్తు పెరగాలన్న ఆశతో..మృత్యు ఒడికి..
-
జాబ్ సెర్చ్‌కు సోషల్ మీడియా!
జనరల్ నాలెడ్స్: మీ అర్హతలకు తగిన కొలువులు ఎక్కడున్నాయో గాలించడానికి ఇంకా వార్తాపత్రికలు, టీవీ ప్రకటనలు, స్నేహితుల సలహాలపై ఆధారపడు తున్నారా? అయితే, మీరు వెంటనే వ్యూహం మార్చాల్సిందే. ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఎక్కు వగా సామాజిక మాధ్యమా ల్లోనే వెలువడుతున్నాయి. ఉద్యోగాలు, ఖాళీల సంఖ్య, కావాల్సిన అర్హతలు.. తదితర సమాచారాన్ని అభ్యర్థులకు చేరవేయడానికి కంపెనీలు సోషల్ మీడియాను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ వంటివాటిలో ఖాతాలు లేని యువత దాదాపు లేరనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలను సక్రమంగా ఉపయోగించు కుంటే కొలువును ఇట్టే గుర్తించొచ్చు. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉద్యోగం సాధించడం సులువవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. యాజమాన్యంతో ప్రత్యక్ష సంబంధాలు సోషల్ మీడియా రాకతో హద్దులు చెదిరిపోయాయి. ఎవరి వివరాలైనా ఎక్కడికైనా చేరిపోతున్నాయి. ఒక్క క్లిక్‌తో సమస్త సమాచారం తెలుస్తోంది. ఏదైనా సంస్థకు దరఖాస్తు పంపడానికంటే ముందే ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి. దానికోసం కొంత పరిశోధన చేయాలి. కంపెనీతో సంబంధాలు ఏర్పరచుకోవాలంటే.. మొదట మీ వివరాలతో కూడిన సందేశం పంపించాలి. మొదటి సందేశంలోనే ఉద్యోగం ఇవ్వండి అని అడగొద్దు. అక్కడి నుంచి ప్రతిస్పందన వచ్చాక.. మీ సంస్థలో ఏమైనా ఖాళీలు ఉన్నాయా? అంటూ విజ్ఞప్తి పంపాలి. బ్లాగ్‌ల్లో సభ్యత్వం తీసుకోండి వార్తలు, లేటెస్ట్ ఫ్యాషన్లు, సినిమా కబుర్లు తెలుసుకోవడానికి బ్లాగ్‌లను సందర్శించడం మామూలే. గత కొన్నేళ్లుగా ఇందులోనూ మార్పులు జరుగుతున్నాయి. కొన్ని మేజర్ బ్లాగ్‌ల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇస్తున్నారు. జాబ్స్ లింక్‌లను ఆయా వెబ్సైట్లలో చేరుస్తున్నారు. వీటిలో సభ్యత్వం తీసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. ఆన్లైన్లో జాబ్ సెర్చ్ చేసేందుకు గంటలకొద్దీ శ్రమించాల్సిన అవసరం ఉండదు. బ్లాగ్ల ద్వారా నేరుగా ఉద్యోగావకాశాలను ఒడిసిపట్టుకోవచ్చు. పాపులర్ సైట్స్.. జాబ్ టూల్స్ సోషల్ మీడియా ద్వారా సులువుగా జాబ్ వెతుక్కోవాలంటే అందులో చురుగ్గా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. ప్రధానంగా ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిలో క్రియాశీలకంగా ఉండాలి. ఎందుకంటే సంస్థల యాజమాన్యాలు ఎక్కువగా ఉపయోగిస్తున్న మోస్ట్ పాపులర్ సైట్లు ఇవే. కంపెనీలతో డెరైక్ట్‌గా కనెక్ట్ కావాలంటే ఆయా సైట్లలో మీ పాత్ర తప్పనిసరి. లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ రిక్రూటర్లు చూసేందుకు వీలుగా మీ పూర్తి ప్రొఫైల్‌ను లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయండి. రెజ్యుమె తరహాలో మీ వివరాలను అందులో పొందుపర్చండి. ట్విట్టర్ విషయంలోనూ ఇదే పద్ధతిని పాటించండి. ఒక సంస్థలో పనిచేస్తున్న సీనియర్ రికమండేషన్ ఉంటే ఇంకా మంచిది. దీనివల్ల మీ ప్రొఫైల్‌కు విలువ పెరుగుతుంది. రిక్రూటర్లు మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు వీలుంటుంది. ఫేస్‌బుక్‌దే పెద్దపాత్ర కొలువు వేట విషయంలో ఫేస్‌బుక్‌దే పెద్దపాత్ర. ఇందులో 500 మిలియన్ల మంది సభ్యులున్నారు. కంపెనీలు దీనిపై అధికంగా ఆధారపడుతున్నాయి. జాబ్ సైట్లు కూడా ఫేస్బుక్ ఖాతాలను తెరుస్తు న్నాయి. ఇష్టమైన ఉద్యోగం సాధించడానికి ఫేస్ బుక్‌లో సెర్చ్ చేయండి. మీ రెజ్యుమెను మీ ఫేస్ బుక్ ఖాతాలో చేర్చండి. నెట్‌వర్క్‌ను విస్తరించు కోవడానికి కూడా ఈ మాధ్యమం ఉపయోగపడు తుంది. జాబ్సైట్లను మీ ఫ్రెండ్స్లిస్ట్లో చేర్చుకుంటే ఎంతో ఉపయోగకరం. జాబ్ అప్డేట్స్ సులువుగా తెలిసిపోతుంటాయి. యూట్యూబ్‌లో వీడియో రెజ్యుమె యూట్యూబ్ ద్వారా వీడియో రెజ్యుమెలను పంపడం విదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నదే. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే వీడియో రెజ్యుమెను తయారు చేసుకోవాలి. సాధారణ రెజ్యుమె కంటే ఇది మెరుగైన ఫలితాన్నిస్తుంది. వీడియో రెజ్యుమె అనేది సంక్షిప్తంగా, ప్రభావవంతంగా ఉండాలి. మీ వివరాలను, అర్హతలను, స్కిల్స్‌ను ఆసక్తికరంగా చెబుతూ వీడియో చిత్రీకరించుకోండి. ఉద్యోగానికి అవసరమైన అర్హతలు, అనుభవం మీలో ఉన్నాయని వీడియోలో తెలియజేయాలి. అది అత్యుత్తమమైన నాణ్యత, దోషరహితంగా ఉండేలా జాగ్రత్తపడాలి. వీడియో రెజ్యుమెను రూపొందించుకోవడంలో తొందరపాటు పనికిరాదు. ఎందుకంటే దాన్ని ఒకసారి యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం కష్టం. జనరల్ నాల్డెజ్