త్వరలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. ఎప్పుడంటే.. | GST Council May Simplify Slabs: 5% & 18% Rates Likely, Tax Cuts on Essentials | Sakshi
Sakshi News home page

త్వరలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. ఎప్పుడంటే..

Aug 29 2025 2:26 PM | Updated on Aug 29 2025 2:47 PM

56th GST Council Meeting scheduled for September 3 4 2025 in New Delhi

ఇ‍ప్పటికే విపక్ష పాలిత రాష్ట్రాల నాయకులు భేటీ

జీఎస్టీ శ్లాబ్‌లను సరళీకరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. కేంద్రం 5, 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లను మాత్రమే ఉంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఇందులో దీనిపై చర్చించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పలు వస్తువులు, సేవల రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్రం ప్రతిపాదించిన ఐదు శాతం పన్ను పరిధిలోకి హోటల్ గదుల అద్దెలు, 100 రూపాయల సినిమా టికెట్లు, బ్యూటీ సర్వీసెస్ ఉంటాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్, ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు, రేస్ క్లబ్‌లపై 40 శాతం పన్ను విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 30 క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు, అరుదైన వ్యాధుల ఔషధాలు పూర్తిగా టాక్స్ ఫ్రీ శ్లాబ్‌లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. మెడికల్ ఆక్సిజన్, అయోడిన్, పొటాషియం ఐయోడేట్ 12% నుంచి 5%కి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రీమియం ఎయిర్ టికెట్లు 18% శ్లాబ్‌లో, వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు, మైక్రోన్యూట్రియెంట్స్, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లపై 5% జీఎస్‌టీ, టెక్స్‌టైల్‌, హ్యాండీక్రాఫ్ట్స్, సింథటిక్ యార్న్, కార్పెట్స్, టెర్రకోటా వస్తువులు, కొన్ని రకాల ఫుట్‌వేర్‌ను 5% జీఎస్టీ శ్లాబ్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. విద్యకు ఉపయోగపడే మ్యాప్స్, అట్లాసులు, షార్పెనర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్‌పై 5% జీఎస్టీ విధిస్తారని అంచనాలున్నాయి. రేట్ల తగ్గింపుపై విపక్ష పాలిత రాష్ట్రాల నాయకులు ఇటీవల డిల్లీలోని కర్ణాటక భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.

ఇదీ చదవండి: వైద్య రంగంలో కృత్రిమ మేధ విస్తరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement