
ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద 50 గిగావాట్ల లిథియం అయాన్ సెల్, బ్యాటరీ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకై భారత్‌కు రూ.33,750 కోట్లు కావాలి. మొబిలిటీ, విద్యుత్ రంగం 2030 నాటికి కర్బనరహితం కావడానికి 903 గిగావాట్ అవర్ విద్యుత్ నిల్వ సామర్థ్యం అవసరమని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, వాటర్ (సీఈఈడబ్ల్యూ) తన నివేదికలో తెలిపింది.
ఈ డిమాండ్‌లో అత్యధికం లిథియం అయాన్ బ్యాటరీలు తీరుస్తాయని వివరించింది. చమురు, సహజ వాయువు మాదిరిగానే పర్యావరణ అనుకూల భవిష్యత్ కోసం లిథియం ముఖ్యమైనదని వెల్లడించింది. దేశంలోనే అవసరమైన సెల్, బ్యాటరీ తయారీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా ఆసక్తి చూపుతోందని వివరించింది. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని తెలిపింది.
(ఇదీ చదవండి: రెపో రేటు పెంపును వ్యతిరేకించిన ఆ ఇద్దరు ఎంపీసీ సభ్యులు!)