బజాజ్ 2026 పల్సర్ లాంచ్.. ధర ఎంతంటే? | 2026 Bajaj Pulsar 180 Launched | Sakshi
Sakshi News home page

బజాజ్ 2026 పల్సర్ లాంచ్.. ధర ఎంతంటే?

Apr 10 2026 9:37 PM | Updated on Apr 10 2026 9:37 PM

2026 Bajaj Pulsar 180 Launched

2026 బజాజ్ పల్సర్ 180 భారతదేశంలో రూ. 1,22,490 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయింది. ఈ మోటార్‌సైకిల్ బజాజ్ పల్సర్ 150, బజాజ్ పల్సర్ 220F మధ్య ఉంది. సాధారణ మోడల్ కంటే కూడా ఇది అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.

పల్సర్ 180 లో 178.61cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,500rpm వద్ద 16.77bhp పవర్, 6,500rpm వద్ద 15Nm గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది అన్నివిధాలా వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

డిజైన్ పరంగా.. బజాజ్ ఐకానిక్ పల్సర్ స్టైలింగ్‌ను అలాగే కొనసాగించింది. అయితే.. 2026 మోడల్ ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఉండేలా సూక్ష్మమైన కాస్మెటిక్ అప్డేట్స్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు బ్లాక్ అవుట్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది. కలర్ ఆప్షన్‌ను బట్టి కాంట్రాస్టింగ్ హైలైట్స్‌తో వస్తుంది. అదనంగా.. ముందు మడ్‌గార్డ్ కార్బన్-ఫైబర్ లాంటి ఫినిషింగ్‌ను పొందింది, ఇది దాని స్టైలింగ్‌కు మరింత స్పోర్టీ టచ్‌ను జోడిస్తుంది. హెడ్‌ల్యాంప్ డిజైన్‌లో ఎల్ఈడీ లైటింగ్‌ను పొందుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement