
ఇండియన్ మోటార్ సైకిల్స్.. భారతదేశంలో 2025 స్కౌట్ రేంజ్ బైకులను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్స్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. మంచి పనితీరును అందించేలా రూపుదిద్దుకున్నాయి.
2025 ఇండియన్ స్కౌట్ శ్రేణిలో.. స్కౌట్ సిక్స్టీ లైనప్ కింద మూడు బైకులు (స్కౌట్ సిక్స్టీ క్లాసిక్, స్కౌట్ సిక్స్టీ బాబర్).. స్కౌట్ క్లాసిక్ లైనప్ కింద ఐదు మోడళ్లు (స్కౌట్ క్లాసిక్, స్కౌట్ బాబర్, స్పోర్ట్ స్కౌట్, సూపర్ స్కౌట్, 101 స్కౌట్) ఉన్నాయి.
స్కౌట్ సిక్స్టీ రేంజ్ బైకులు 999సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 85 bhp పవర్, 87 Nm టార్క్ అందిస్తుంది. స్కౌట్ క్లాసిక్ రేంజ్ బైకులు 1250 సీసీ ట్విన్ మోటారు ద్వారా 105 Bhp పవర్, 108 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్లు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.
ఇదీ చదవండి: రెనాల్ట్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
డిజిటల్ డిస్‌ప్లే, ఎల్ఈడీ లైటింగ్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అనలాగ్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఇగ్నిషన్, కనెక్టెడ్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి.. లేటెస్ట్ ఇండియన్ మోటార్ సైకిళ్ళలో చూడవచ్చు.