
రెనాల్ట్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'కైగర్ ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసింది. నాలుగు ట్రిమ్‌లలో లభించే ఈ కొత్త మోడల్ ధరలు రూ. 6.30 లక్షల నుంచి రూ. 11.30 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య ఉన్నాయి. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది.
కొత్త కైగర్ ఫేస్‌లిఫ్ట్.. చాలా వరకు కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్.. ట్రై ప్రొజెక్టర్ హెడ్‌లైట్ ఇందులో ఉన్నాయి. డేటైమ్-రన్నింగ్ లాంప్ (DRL) క్లస్టర్‌ల కింద ఉండటం గమనించవచ్చు. 16 ఇంచెస్ అల్లాయ్ వేల కలిగిన ఈ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే టెయిల్‌ల్యాంప్ పొందుతుంది.
ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఈ కారులో ఉంటుంది. క్యాబిన్ ఇప్పుడు మెరుగైన సౌండ్ ఇన్సులేషన్‌ను అందిస్తుంది. క్యాబిన్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ లాగానే డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ పొందుతుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెథరెట్ అపోల్స్ట్రే, 360 డిగ్రీ కెమెరాలు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లు ఉన్నాయి. ఈ కారులో ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు
2025 రెనాల్ట్ కైగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్.. 72 bhp పవర్, 96 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఇది ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.