మట్టి కుండ... ప్లాస్టిక్‌ బాటిల్‌ | - | Sakshi
Sakshi News home page

మట్టి కుండ... ప్లాస్టిక్‌ బాటిల్‌

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

కరకగూడెం: ఓ ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌పై మెరిసిపోయే ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ ఉండేది. ఆ పక్కనే చిన్న మట్టి కుండ ఉండేది. ప్లాస్టిక్‌ బాటిల్‌ తన రంగులను చూసుకుని గర్వపడేది. ఓ రోజు మట్టి కుండను చూస్తూ ‘నువ్వు చూడడానికి నల్లగా ఉన్నావు. నేను ఎంత మోడ్రన్‌గా ఉన్నానో చూడు. నన్ను అందరూ కార్లలో ఆఫీసులకు తీసుకెళ్తారు’ అని ఎగతాళి చేసింది. అందుకు మట్టికుండ నవ్వి.. ‘నువ్వు నీటిని దాస్తావు నిజమే కానీ నేను నీటిని సహజంగా చల్లబరిచి మనుషులకు ఆరోగ్యాన్ని ఇస్తాను’ అంది. అయినా బాటిల్‌ వినలేదు. కొద్దిరోజుల తర్వాత ఎండలు తీవ్రమయ్యాయి. ఫ్రిజ్‌లో పెట్టి తీసిన ప్లాస్టిక్‌ బాటిల్‌లోని నీరు ఐదు నిమిషాలకే వేడెక్కాయి. అంతేకాక బాటిల్‌లోని నీరు తాగిన పిల్లల గొంతు నొప్పి వచ్చింది. కానీ మట్టి కుండలోని నీరు ఎండ ఎంత ఉన్నా చల్లగానే ఉన్నాయి. దీంతో ఇంట్లో వారంతా ప్లాస్టిక్‌ బాటిల్‌ను పక్కనబెట్టి మట్టి కుండ నీటినే తాగడం మొదలుపెట్టారు. పైగా ప్లాస్టిక్‌ బాటిల్‌ పాతదైపోవడంతో దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అప్పుడు అది తాను ప్రకృతికి భారమని, మట్టి కుండ మాత్రం ప్రకృతిలో కలిసిపోయే గొప్ప వస్తువని తెలుసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement