భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో మంగళవారం స్వామి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూ జలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణఽ దారణ, యోక్త్రధారణ గావించాక నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారం కావడంతో ఆంజ నేయస్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి.
నర్సరీ నిర్వహణపై
ప్రత్యేక దృష్టి
జూలూరుపాడు: వేసవి నేపథ్యాన నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించా లని జిల్లా అటవీ శాఖాధికారి కిష్టాగౌడ్ సూ చించారు. జూలూరుపాడు మండలం వినోభా నగర్‌లోని అటవీ నర్సరీని మంగళవారం ఆయ న సందర్శించారు. ఈ సందర్భంగా వేసవిలో మొక్కల సంరక్షణపై అటవీ సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే, వచ్చే ఏడాది నాటేందుకు కావాల్సిన మొక్కలు సిద్ధం చేయాలని తెలిపా రు. అంతేకాక అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎఫ్‌ఆర్‌ఓ జి.ప్రసాద్‌రావు, ఎఫ్‌ఎస్‌ఓ మల్లయ్య, బీట్ ఆఫీసర్ రేఖ తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల రవాణాకు వాహనాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులకు నాణ్య మైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ఎన్పీడీసీఎల్ ద్వారా ట్రా న్స్‌ఫార్మర్ల రవాణాకు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ జి.మహేందర్ తెలిపారు. జిల్లాలో 13 వాహనాలు అందుబాటులో ఉండగా, ప్రతీ వా హనానికి జీపీఎస్ అమర్చినట్లు వెల్లడించారు. ప్రతీ డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో వాహనాలు అందుబాటులో ఉన్నందున, ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందనే సమాచారం తెలియగానే సిబ్బంది వెళ్లి తీసుకొచ్చి మరమ్మతు అనంతరం తిరిగి చేరుస్తారని తెలిపా రు. ఈమేరకు ఎక్కడైనా సమస్య తలెత్తితే తమ సిబ్బందికి నేరుగా కానీ 1912 నంబర్‌కు కానీ సమాచారం ఇవ్వాలని ఎస్‌ఈ ఓ ప్రకటనలో సూచించారు.
ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించండి
గుండాల: రైతులు ఏటేటా పంట మార్పిడి చేస్తూ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు సూచించారు. గుండాల రైతువేదికలో మంగళవారం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులో ఆయన మాట్లాడారు. అవసరం మేరకే యూరియా వా డడం ద్వారా ఖర్చులు తగ్గి, భూమి సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అంతేకాక సాగునీరు ఆదా చేయాలన్నారు. అలాగే, పంట అవశేషాలను తగలబెట్టకుండా కలియదున్నడంతో భూసారం పెరుగుతుందని తెలిపారు. అనంతరం వచ్చే వానాకాలంలో పంటల సాగుకు విత్తనాల ఎంపిక తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏడీఏ తాతారావు, కేవీకే కోఆర్డినేటర్ కె.భరత్, శాస్త్రవేత్త శివ, సర్పంచ్ కకె.సీతారాములు, ఏఓ వెంకటరమణ, ఏఈఓలు బాలరాజు, లెనిన్ పాల్గొన్నారు.


