అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అందరి బాధ్యత

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

మహిళలు, బాలికల రక్షణ

టేకులపల్లి: మహిళలు, బాలికల భద్రత అనేది చట్టాలకు పరిమితం కాకుండా.. అందరూ బాధ్యతగా భావించాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా టేకులపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ బాలికల రక్షణ చట్టాలతో రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించాక మాట్లాడారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో సెల్‌ఫోన్ల వినియోగం పెరగడంతో బాలికలు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నందున విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి లెనినా మాట్లాడుతూ అపరిచితుల మాట లు నమ్మి మోసపోకుండా, ఆపద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహా లు చట్టరీత్యా నేరమైనందున ఎవరైనా బలవంతం చేస్తే ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆతర్వాత బాలికలు, మహిళల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. సదస్సులో సర్పంచ్‌ నాకా, సీడీపీఓ కే.ఎం తార, తహసీల్దార్‌ ఎల్‌.వీరభద్రం, వైద్యాధికారి వెంకటేశ్‌, వివిధ శాఖల ఉద్యోగులు జేఎల్‌.గణేష్‌గాంధీ, హరికుమారి, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు పరిశీలన

టేకులపల్లి మండలం బొమ్మనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ అంకిత్‌ తనిఖీ చేశారు. ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, కొనుగోళ్లు, నాణ్యత పరిశీలనపై చర్చించారు. తేమ శాతం నిర్ధారణలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. రికార్డుల నిర్వహణ, ఎండల దృష్ట్యా ఏర్పాట్లపై సూచనలు చేశారు. తహసీల్దార్‌ వీరభద్రం, ఏఓ అన్నపూర్ణ, సొసైటీ సీఈఓ ప్రేమాచారి, ఏఈఓలు భాగ్యశ్రీ, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అవగాహన సదస్సులో కలెక్టర్‌ అంకిత్‌

Advertisement
 
Advertisement
Advertisement