ఖమ్మం స్పోర్ట్స్: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ పనుల్లో వేగం పెంచి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకుండా ట్రాక్‌ను సిద్ధం చేయాలని తెలిపారు. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం మంత్రి ఖమ్మం 18వ డివిజన్, శ్రీరామ్‌హిల్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


