సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో నీట్(యూజీ) నిర్వహణలో లోపాలు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. మే 3వ తేదీన మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం 5గంటల వరకు జరిగే పరీక్షకు 1,078 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఇందుకోసం మూడు కేంద్రాలను ఏర్పాటుచేశామని, విద్యార్థులను ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు అనుమతించాలని సూచించారు. అంతేకాక కేంద్రాలు, సమీప ప్రాంతాల్లో భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, నీట్ పరీక్ష ఇన్‌చార్జ్ ప్రసాద్, డీఎస్పీ ఆదినారాయణ, సీఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.


