అశ్వారావుపేట: అశ్వారావుపేటలో మద్యం వ్యాపారులు సిండికేట్ అవుతున్నట్లు తెలిసింది. గత ఏడాదిడిసెంబర్‌లో వైన్స్ దక్కించుకున్న వ్యాపారు లు ఇన్నాళ్లు ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఆరు వైన్స్‌ను దక్కించుకున్న వారి రాజకీయ, సామాజిక నేపథ్యాలు వేర్వేరు కావడంతో సిండికేట్ కావడానికి సుముఖత చూపలేదు. ఈ నేపథ్యాన ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు కొనసాగుతున్నా యి. అయితే, ఇప్పుడు ఎవరు చొరవ చూపారో తెలియదు కానీ అంతా సిండికేట్ కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదే జరిగితే లైసెన్స్‌డ్ మద్యం దుకాణాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే చీప్‌లిక్కర్, ఇతర బ్రాండ్ల మద్యం, బీర్లను అమ్మొ ద్దని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాక క్వార్టర్ సీసాపై ఎమ్మార్పీకి రూ.40 అదనంగా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అది కూడా ఫుల్ బాటిళ్లనుంచే లూజ్ చేసి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయాన కాస్త ఖరీదైన మద్యం మాత్రం యథావిధిగా అమ్మాలని భావిస్తుండగా.. ఒకటి, రెండు రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చే అవకాశముందని తెలిసింది.
ఒక్కో క్వార్టర్‌పై రూ.40 అదనం


