బదిలీ కలెక్టర్‌కు ఘన సన్మానం | - | Sakshi
Sakshi News home page

బదిలీ కలెక్టర్‌కు ఘన సన్మానం

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

ఖమ్మంసహకారనగర్‌: ఖమ్మం కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన అనుదీప్‌ దురిశెట్టిని జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం ఘనంగా సత్కరించింది. తొలుత నూతన కలెక్టర్‌ దివాకర.. అనుదీప్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ కలెక్టర్‌గా అనుదీప్‌ సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌ తదితరులు మాట్లాడాక సన్మానించారు. టీఎన్జీవోస్‌, టీజీవోస్‌ నాయకులతో పాటు జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్‌ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement