ఇల్లెందురూరల్: మండలంలోని మొండితోగు గ్రామంలో అటవీశాఖ పంట చేల వెంట చేపట్టిన ట్రెంచ్ కటింగ్ పనులను గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా పనులు చేస్తున్నామని ఎఫ్‌ఆర్‌ఓ చలపతిరావు, డీఆర్‌ఓ వీరబాబు గ్రామస్తులకు నచ్చజెప్పే పయత్నం చేసినా వారు ససేమిరా అంటూ ట్రెంచ్ కటింగ్ పనులను ముందుకు సాగనీయలేదు. మాజీఎంపీటీసీ పూనెం సురేందర్ అక్కడకు చేరుకొని అటవీశాఖ అధికారులతో చర్చించారు. రైతుల వద్ద పోడు పట్టాలు ఉన్నాయని, మరికొంత మందికి సర్వే ప్రక్రియ పూర్తయి పట్టాల మంజూరు పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. అలాంటి వారిని గుర్తించిన తరువాత ట్రెంచ్ కటింగ్ పనులు చేసుకోవా లని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రైతు ల దరఖాస్తులను పరిశీలించిన తరువాత పను లు కొనసాగిస్తామని అధికారులు తెలపడంతో వివాదం సద్దుమనిగింది.
మార్కెట్‌లో మిర్చి చోరీలు అరికట్టాలని వినతి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మా ర్కెట్‌లో మిర్చి దొంగతనాలను అరికట్టడమే కాక మార్కెట్ పరిసరాల్లో చిల్లర కొనుగోళ్లను నిలువరించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ మిర్చి శాఖ ప్రతినిధులు కోరారు. మంగళవారం వారు మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రాలు అందించారు. మార్కెట్‌లో రైతులు విక్రయించిన మిర్చి బస్తాలను కొందరు కోసి దొంగిలిస్తుండడంతో వ్యాపారులకు నష్టం జరుగుతోందని తెలిపారు. అలాగే, పరిసరాల్లో చిల్లర కౌంటర్ల ద్వారా మార్కెట్ ఆదాయానికి గండి పడుతోందని చెప్పారు. కార్యక్రమంలో మిర్చి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు మెంతుల శ్రీశైలం, యడ్లపల్లి సతీశ్‌కుమార్, చాంబర్ ప్రధాన కార్యదర్శి సోమ నర్సింహారావు, ఉపాధ్యక్షుడు బత్తిని నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
రేపు కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజాదర్బార్
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఈనెల 30న ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. గురువారం ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, నగర, మండలాల బాధ్యులు పాల్గొంటారని ఓ ప్రకటనలో తెలిపారు.
నేడు న్యాయవాద
సంక్షేమ సంఘం ఎన్నికలు
ఖమ్మంలీగల్: ఖమ్మం న్యాయవాద సంక్షేమ సంఘం ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 534 మందికి ఓటు హక్కు కలిగి ఉండగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు గుద్దేటి రమేశ్, కూరపాటి శేఖర్ రాజు తెలిపారు. ఆ తర్వాత పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించా రు. కాగా, నాలుగు డైరెక్టర్ పదవులకు గాను మన్నేపల్లి బసవయ్య, తెరళ గంగాధర్, షేక్ మల్సూర్, కొలకలూరి ప్రసాద్, దొంతబోయిన రామారావు, చెన్నోజు వెంకటరమణాచారి, చింతల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ పోటీ పడుతున్నారు.
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో తేడాలు రావొద్దు
ఖమ్మంసహకారనగర్: పూర్తిస్థాయి సమాచారంతో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ కచ్చితంగా పూర్తి చేయాలని హైదరాబాద్ సీఈఓ కార్యాలయ ఎస్‌డీసీ శ్రీరామ్‌ప్రసాద్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ఎస్‌ఐఆర్ మ్యాపింగ్, డేటా సమన్వయంపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. 2002 నుంచి 2025 వరకు రికార్డులను పరిశీలించి ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ చేపట్టాలని తెలిపారు. ప్రతీ దశలో వివరాలను సరిపోల్చుకోవడం ద్వారా పొరపాట్లు దొర్లవని చెప్పా రు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్‌డీసీ రాజేశ్వరి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజు, టీటీ అన్సారి తదితరులు పాల్గొన్నారు.


