దమ్మపేట: కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గిరిజన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. బీఏ (హెచ్‌ఈపీ), బీఎస్సీ (బీజెడ్సీ, ఎంపీపీఎస్), బీకాం (జనరల్, సీఏ) కోర్సుల్లో ప్రథమ సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఉచితంగా నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి, డిజిటల్ తరగతులు, గ్రంథాలయం, ప్రయోగశాల సౌకర్యాలే కాక అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కేజీ గంజాయి స్వాధీనం
మణుగూరురూరల్: మండలంలోని కొత్త పద్మగూడెం గ్రామంలోని ఓ ఇంట్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు సీఐ పాటి నాగబాబు తెలిపారు. మణుగూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో కొత్త పద్మగూడెంలోని మిడియం గోవింద్ ఇంట్లో తనిఖీ చేయగా 1.085 కేజీల గంజాయి లభ్యమైందని తెలిపా రు. ఈ సందర్భంగా గోవింద్‌ను అదుపులోకి తీసుకోవడమే కాక ఆయనకు గంజాయి అమ్మిన గుట్టమల్లారం వాసి సాయి అలియాస్ గుట్ట సాయి, కొనుగోలు చేస్తున్న సత్తుపల్లికి చెందిన జుజునూరి సింహాద్రి అలియాస్ సందీప్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. గోవింద్‌ను రిమాండ్‌కు తరలించి, మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ సీహెచ్ నగేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
అదుపు తప్పి లారీ బోల్తా
అశ్వాపురం: మండలంలోని సీతారాంపురం వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. కంకరలోడ్‌తో మణుగూరు వైపు వెళ్తున్న లారీ సీతారాంపురం వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారి వెంట అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఆపై కాల్వలో బోల్తాపడగా, డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
పేకాట స్థావరంపై దాడి
చండ్రుగొండ: మండలంలోని గుర్రాయిగూడెం శివా రు అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై కొత్తగూ డెం టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐరమాకాంత్ కథనం ప్రకారం.. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టడంతో పేకాట ఆడుతున్న పదిమంది పట్టుబడ గా, మరో తొమ్మిదిమంది పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.42,460నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనంచేసుకున్నారు. నింది తులపై కేసు నమోదు చేసినట్లు చండ్రుగొండ ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు.


