తెగిపడిన విద్యుత్‌ తీగ | - | Sakshi
Sakshi News home page

తెగిపడిన విద్యుత్‌ తీగ

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

వైరా: భారీ వాహనం వెళ్లే క్రమాన విద్యుత్‌ తీగలకు తాకి తెగిపడడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఏపీకి చెందిన భారీ ట్రాలీ వాహనం మంగళవారం ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారిపై వెళ్తోంది. ఈ క్రమాన వైరా శాంతినగర్‌ వద్ద విద్యుత్‌ తీగలకు తగలడంతో అవి తెగి నడి రోడ్డుపై పడ్డాయి. అంతేకాక తీగలకు అనుసంధానంగా ఉన్న స్తంభం సైతం ద్విచక్రవాహనంపై పడి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. అయితే, తీగలు రోడ్డుపై పడి ఉండటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్‌ అధికారులు చేరుకుని తీగలను తొలగించి మరమ్మతులు చేపట్టగా.. పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరించారు.

స్తంభించిన వాహనాల రాకపోకలు

Advertisement
 
Advertisement
Advertisement