కలెక్టర్‌ను కలిసిన సంఘాల నాయకులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన సంఘాల నాయకులు

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

ఖమ్మం సహకారనగర్‌/ఖమ్మం అర్బన్‌/ఖమ్మం మామిళ్లగూడెం: కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దివాకర టీఎస్‌ను టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఉద్యోగులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి కొణిదన శ్రీనివాసరావుతో పాటు జైపాల్‌, యర్రా రమేష్‌, అస్లాం ఖాన్‌, లలితకుమారి, తాళ్లూరి శ్రీకాంత్‌, కోనార్‌ హరికృష్ణ, రాధికారెడ్డి, రుక్మారావు, ఫజల్‌, సైదులు, రాజ్‌కుమార్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. అలాగే, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు ఆధ్వర్యాన కలెక్టర్‌ను సన్మానించడంతో పాటు మిల్లర్ల సమస్యలను వివరించారు. అంతేకాక నూతన కలెక్టర్‌ దివాకరను రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ వెలిగేటి చంద్రమోహన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట సొసైటీ సభ్యులు జెల్లా వెంకటేశ్వర్లు, మూలగుండ్ల శ్రీహరి, కొత్త సత్యనారాయణరెడ్డి, గజేంద్రుల నాగేశ్వరరావు, గట్టు మోహన్‌రావు, షకీల్‌ అహ్మద్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement