రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

కొణిజర్ల: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలపాలైన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ జి.సూరజ్‌ కథనం ప్రకారం.. మండలంలోని పెద్ద మునగాలకు చెందిన తుప్పతి సత్యనారాయణ (34), చింతల కేశవులు పెద్దగోపతిలోని బంక్‌లో డీజిల్‌ కోసం ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. పెద్దగోపతి నుంచి పెద్దమునగాల వైపు రాజారాపు నారాయణ బైక్‌పై వస్తుండగా.. ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఘటనలో కేశవులు బైక్‌పై వెనుక కూర్చున్న సత్యనారాయణ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమైంది. కేశవులు, నారాయణ కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రు లను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ సత్యనారాయణ మృతి చెందాడు. ఆయనకు భార్య త్రివేణి,కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్‌ తెలిపారు.

నీళ్ల కోసం వచ్చి

నగదు చోరీ

దమ్మపేట: తాగునీరు కావాలని వచ్చిన పలువురు నగదు చోరీ చేసిన ఘటన ఇది. మండలంలోని మందలపల్లిలో నూతక్కి రాజశేఖర్‌ ఇంటికి మంగళవారం నలుగురు మహిళలు, ఓ పురుషుడు వచ్చి తాగడానికి నీరు కావాలని అడిగారు. దీంతో రాజశేఖర్‌ భార్య రమ్య తన చేతిలోని రూ.2 వేల నగదు కుర్చీలో పెట్టి లోపలికి వెళ్లింది. తిరిగి నీళ్లతో వచ్చేసరికి నగదు, అపరిచిత వ్యక్తులు కనిపించలేదు. ఈ మేరకు రాజశేఖర్‌ కుటుంబీకులు గ్రామంలో గాలించి వారిని పట్టుకుని అప్పగించగా, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement